parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Tilak Poetry | Pathana Kutuhalam

06-04-2021published_dt 2021-04-06T08:47:45.980Z06-04-2021 14:17:45 IST
Updated On 06-04-2021 17:20:46 ISTmodified_dt 2021-04-06T11:50:46.328ZUpdated On 06-04-20212021-04-06T08:47:45.980Z06-04-2021 2021-04-06T08:47:45.980Z - 2021-04-06T11:50:46.328Z - 06-04-2021

మనము అనునిత్యము చూసే, పలికే అక్షరాలు తిలక్ కంటికి ఎలా కనపడ్డాయో తెలుసుకుంటే ఆయనది ఎంత విలక్షణమైన కవి కంఠమో అర్థమౌతుంది. 

" నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు 

  నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు 

  నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు "

ఆలా  తాను భావించిన అక్షరాలతో తిలక్ -

గాజు కెరటాల వెన్నెల సముద్రాలు 

జాజి పువ్వుల అత్తరు దీపాలు 

మంత్ర లోకపు మణి స్తంభాలు 

తన కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు సృష్టించాడు 

"అమృతం కురిసిన రాత్రి" సంకలనానికి ముందు మాట వ్రాస్తూ కుందుర్తి అన్న మాటలు ఆధునిక వచన కవితా యవనిక మీద తిలక్ స్థానానికి నిండు నిర్వచనంగా నిలుస్తాయి : అభ్యుదయ భావనా, కాల్పనికోద్యమ కాలం నాటి శబ్ద సౌందర్యము ఈ రెంటి మేళవింపు తిలక్ కవిత్వం.

తిలక్ కు నివాళులర్పిస్తూ శ్రీశ్రీ వ్రాసిన గేయ పాదాలను స్మరించుకుని తిలక్ అక్షరాలను, ఆ అక్షరాలతో అయన సృష్టించిన కవితా శిల్పాన్నీ దర్శించుకుందాం:

శ్రీశ్రీ అన్నాడు :

కవితా సతి నొసటి నిత్య 

రస గంగాధర తిలకం 

సమకాలీన సమస్యలకు 

స్వచ్ఛ స్ఫాటిక ఫలకం

 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin