06-07-2021published_dt 2021-07-06T17:52:45.813Z06-07-2021 23:22:45 IST Updated On 06-07-2021 23:24:12 ISTmodified_dt 2021-07-06T17:54:12.579ZUpdated On 06-07-20212021-07-06T17:52:45.813Z06-07-2021 2021-07-06T17:52:45.813Z - 2021-07-06T17:54:12.579Z - 06-07-2021
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-07-06T17:52:45.813Z"},{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-07-06T17:53:01.890Z"},{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-07-06T17:54:12.579Z"}],"comments":[],"video_status":"1","view_count":159,"status":"active","_id":"60e4986d4cc44728d4600609","category_id":"5c0e2ef31322bc16a77a2cd1","category_name":"Poetry","title":"Sri Sri Poetry | Pathana Kutuhalam Episode - 2","metatitle":"Sri Sri Poetry | Pathana Kutuhalam Episode - 2","metadescription":"తెలుగు వారికి శ్రీశ్రీ పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. చెప్పాలి అనుకోవడం సాహసమే అవుతుంది. ","metakeywords":"Sri Sri Poetry Pathana Kutuhalam Episode, parakala prabhakar, శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీశ్రీ","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p style=\"text-align: justify;\">శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. తెలుగు వారికి శ్రీశ్రీ పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. చెప్పాలి అనుకోవడం సాహసమే అవుతుంది. \"ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నాం. ఈ శతాబ్ది నాది. 1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తరువాత నుంచి దాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పటి నుంచి తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయ చరిత్ర\". ఇవి శ్రీశ్రీ తనను గురించి తాను చెప్పుకున్న మాటలు. ఇందులో కొంత అతిశయోక్తి ఉన్నా చాలా వరకు నిజం లేకపోలేదు. </p>\r\n<p style=\"text-align: justify;\">మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం రాస్తూ శ్రీశ్రీ గురించి చలం అన్న మాటలు. ''కవిత్వపు కాలం అంతమైంది. నగలు, అపురూపపు కళలు, సూర్య కిరణాలు ఎరుగని అందాలు గతిస్తున్నట్టే కవిత్వము గతించింది. కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవలిసిన గతి పట్టింది. ఈనాటి కవిత్వం అంతా ఏమిటి, ఎందుకుంది, ఏంచేస్తోంది అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం. కొద్ది రోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరు శ్రీశ్రీ నీడ కింద నుంచుని తమ ఉనికిని సమర్ధించుకోవలసిన గతి వస్తుంది''.</p>\r\n<p style=\"text-align: justify;\"> ఏ శ్రీ ఈ శ్రీశ్రీ అని కాళోజీ ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు ఆయనే ఇచ్చిన జవాబు ' ప్రజల సిరి ఈ శ్రీశ్రీ, ప్రజాక్రోధశ్రీ ఈ శ్రీశ్రీ '. </p>\r\n<p style=\"text-align: justify;\">ఇక శ్రీశ్రీ కి జోహార్లు అర్పిస్తూ బాపూ అన్న మాటలు మీకు వినిపించి ఈ పరిచయం లాంటి భాగాన్ని ముగిస్తాను. </p>\r\n<p style=\"text-align: justify;\">''నవయుగ కవితకు శ్రీకారం చుట్టిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఛందో బందో బస్తులను ఛేదించే ముందు వాటిపై, మాటపై తన పలుకుబడిని నిరూపించి, ప్రభుత్వం స్థాపించి, అదీ, ఇదీ తెలుసు నాకు, ఇదే మంచి మీకు అని సాధికారంగా ప్రకటించి జెండా ఎగురవేసిన విప్లవ కవి శ్రీశ్రీ. రేపటి రోజుకు ఊపిరి శ్రీశ్రీ. ఈ తెలుగువాడి జీవనాడిని, మాట వాడిని, కవిత వేడిని లోకమంతటా సహృదయాలలో పలికించే ఉద్యమపు మహాప్రస్థానం మహా కవి శ్రీశ్రీ'' అంటూ వారికీ జోహార్లు అర్పించారు.</p>\r\n</body>\r\n</html>","tags":"#SriSriPoetry #శ్రీరంగంశ్రీనివాసరావు #శ్రీశ్రీ #PathanaKutuhalam #ParakalaPrabhakar","url":"/poetry/sri-sri-poetry-|-pathana-kutuhalam-episode---2","thumbnailratio":"16_9","english_url":"/poetry/sri-sri-poetry-|-pathana-kutuhalam-episode---2","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-07-06T17:52:45.813Z","img_alt_description":"Sri Sri Poety","short_description":"తెలుగు వారికి శ్రీశ్రీ పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. చెప్పాలి అనుకోవడం సాహసమే అవుతుంది. ","embedded":"https://www.youtube.com/watch?v=Jd10w8PQnM8","english_title":"Sri Sri Poetry | Pathana Kutuhalam Episode - 2","thumbnail1":"/uploads/qldEEkWwQG.png","thumbnail2":"/uploads/WiOFAKonzD.png","thumbnail3":"/uploads/SqTozxHnQI.png","__v":0,"modified_dt":"2021-07-06T17:54:12.579Z","editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/poetry/sri-sri-poetry-|-pathana-kutuhalam-episode---2","published_dt":"2021-07-06T17:52:45.813Z","published_dt_txt":"06-07-2021","published_dt_time_txt":"06-07-2021 23:22:45 IST","updated_dt_time_txt":"06-07-2021 23:24:12 IST"}
శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. తెలుగు వారికి శ్రీశ్రీ పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. చెప్పాలి అనుకోవడం సాహసమే అవుతుంది. "ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నాం. ఈ శతాబ్ది నాది. 1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తరువాత నుంచి దాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పటి నుంచి తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయ చరిత్ర". ఇవి శ్రీశ్రీ తనను గురించి తాను చెప్పుకున్న మాటలు. ఇందులో కొంత అతిశయోక్తి ఉన్నా చాలా వరకు నిజం లేకపోలేదు.
మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం రాస్తూ శ్రీశ్రీ గురించి చలం అన్న మాటలు. ''కవిత్వపు కాలం అంతమైంది. నగలు, అపురూపపు కళలు, సూర్య కిరణాలు ఎరుగని అందాలు గతిస్తున్నట్టే కవిత్వము గతించింది. కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవలిసిన గతి పట్టింది. ఈనాటి కవిత్వం అంతా ఏమిటి, ఎందుకుంది, ఏంచేస్తోంది అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం. కొద్ది రోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరు శ్రీశ్రీ నీడ కింద నుంచుని తమ ఉనికిని సమర్ధించుకోవలసిన గతి వస్తుంది''.
ఏ శ్రీ ఈ శ్రీశ్రీ అని కాళోజీ ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు ఆయనే ఇచ్చిన జవాబు ' ప్రజల సిరి ఈ శ్రీశ్రీ, ప్రజాక్రోధశ్రీ ఈ శ్రీశ్రీ '.
ఇక శ్రీశ్రీ కి జోహార్లు అర్పిస్తూ బాపూ అన్న మాటలు మీకు వినిపించి ఈ పరిచయం లాంటి భాగాన్ని ముగిస్తాను.
''నవయుగ కవితకు శ్రీకారం చుట్టిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఛందో బందో బస్తులను ఛేదించే ముందు వాటిపై, మాటపై తన పలుకుబడిని నిరూపించి, ప్రభుత్వం స్థాపించి, అదీ, ఇదీ తెలుసు నాకు, ఇదే మంచి మీకు అని సాధికారంగా ప్రకటించి జెండా ఎగురవేసిన విప్లవ కవి శ్రీశ్రీ. రేపటి రోజుకు ఊపిరి శ్రీశ్రీ. ఈ తెలుగువాడి జీవనాడిని, మాట వాడిని, కవిత వేడిని లోకమంతటా సహృదయాలలో పలికించే ఉద్యమపు మహాప్రస్థానం మహా కవి శ్రీశ్రీ'' అంటూ వారికీ జోహార్లు అర్పించారు.