parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Poetry of Gurajada Apparao | Pathana Kutuhalam Episode - 19

13-07-2021published_dt 2021-07-13T11:00:58.768Z13-07-2021 16:30:58 IST
2021-07-13T11:00:58.768Z13-07-2021 2021-07-13T11:00:58.768Z - - 30-11-2021

విశ్వసాహితీ గగనంలో ధ్రువతార గురజాడ అప్పారావు పంతులు. ఆధునిక తెలుగు సాహిత్య వైతాళికుడు. ఆయన తదనంతరం వచ్చిన కవుల మార్గదర్శి. భాషా ప్రయోగం, వస్తువు ఎంపిక, కథన శిల్ప వైశిష్ట్యం, సామజిక స్పృహ, ఇప్పటికీ సాహితీకారులకు అనుసరణీయంగా నిలబడ్డాయి. ఆధునిక తెలుగు కవులు గురజాడ అడుగుజాడలో నడిచారనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

 

కన్యా శుల్కము నాటకంలో ఆయన సంధించిన చమత్కారం, ఛీత్కారం, తిరస్కారం, వెటకారం ఇప్పటికీ తెలుగు వారి సంభాషణల్లో సజీవంగా ఉన్నాయి. తాంబూలాలిచ్చేశాం, తన్నుకు చావండి; నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంతటి వాడిని చేస్తాను ; అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి ష ; డామిట్! కథ అడ్డం తిరిగింది; మనవాళ్ళుట్టి వెధవాయి లోయ్ వంటి గురజాడ వాడిన మాటలు, ఇప్పటికీ తెలుగు వారి మాటల్ని పదునెక్కిస్తూనే ఉన్నాయి.

 

ఆయన దేశ భక్తి గేయంలో ప్రతి పాదమూ భారత జాతి జనజీవనానికి ఉద్బోధ, మార్గదర్శి, మేలుకొలుపు, మందలింపు. ఆయన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఎన్ని సార్లు చదివినా అన్ని సార్లూ కంటతడి పెట్టిస్తుంది. ప్రతి అక్షరము ఆర్ద్రతతో సాంద్ర మైన ఆ గేయం ఆడపిల్లల్ని డబ్బుకోసం ముసలివాళ్ళకు కట్టబెట్టడాన్ని సమాజం అసహ్యించుకునేలా చేసింది. అయన ఇంగ్లీషు రచనలు నిశిత పరిశీలనా శీలమైనవి.

 

మహాకవి గురజాడ గురించి గురించి నాలుగు మాటలు నాకు తోచినవి రాయాలని గానీ, అసలు వారిని మీకు నేను పరిచయం చెయ్యడం ఏమిటి ?. ఈ ఉపోద్ఘాతం అవసమేముంది ? ఇవాళ గురజాడ తెలుగు రచనలు కొన్ని చదువు కుందాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin