parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Poetry of Digambara Kavulu - Part 02 | Pathana Kutuhalam Episode - 18

13-07-2021published_dt 2021-07-13T10:42:19.528Z13-07-2021 16:12:19 IST
Updated On 13-07-2021 16:13:59 ISTmodified_dt 2021-07-13T10:43:59.003ZUpdated On 13-07-20212021-07-13T10:42:19.528Z13-07-2021 2021-07-13T10:42:19.528Z - 2021-07-13T10:43:59.003Z - 13-07-2021

దిగంబర కవిత్వమంత వివాదాస్పద కవితోద్యమం తెలుగు సాహిత్య చరిత్రలో మరొకటి లేదు. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అరుదు అనడానికి కూడా సాహసించవచ్చు. మహాకవి శ్రీశ్రీ లాంటి వారు ఈ కవులను, వారు రాసిన కవితల్ని ఆహ్వానిస్తే, సాహీతీ విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి, వెల్చేరు నారాయణరావుల వంటి వారు ఆక్షేపించారు. 

 

" అభ్యుదయ కవిత్వం ఆంధ్రప్రదేశ్ లో తన పాత్ర నిర్వహించి తెరవెనక్కి తప్పుకుంది. ఇప్పుడు కొత్త శక్తులు పెరుగుతున్నాయి, కొత్త మంటలు రగులుతున్నాయి. ఇవాళ రాస్తున్న వాళ్ళు దిగంబర కవులు, తిరుగుబాటు కవులు, సంఘర్షణ కవులు. చేతనైతే వాళ్లకు చేయూతనివ్వండి, లేకపోతే నోరుముయ్యండి " అని గదమాయించి మరీ దిగంబర కవుల్ని సమర్ధించాడు శ్రీశ్రీ. 

 

వెల్చేరు నారాయణ రావు వంటివారు దిగంబర కవులు లైంగిక ప్రతీకలు, అశ్లీల పదప్రయోగాలను తప్పుపట్టి ఆక్షేపించారు. కొందరైతే అసహ్యించుకున్నారు. దిగంబరులది ఆకవిత్వ వికృతాకృతిలో వచ్చిన కవిత్వంగా వెల్చేరు వర్ణించారు. దిగంబరుల పైత్యాన్ని కవిత్వమనుకోవాలా అని ప్రశ్నించారు ప్రముఖ విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి. 

 

సమాజం కుళ్ళిపోయిన మాట నిజమే. పతనమైన మాట నిజమే. కానీ ఎంత పతనమయినా ఈ దిగంబరుల పైత్యాన్ని కవిత్వమనుకునేటంతగా దిగజారిపోయిందా? అన్నారు రాచమల్లు. 

 

దిగంబర కవులు తమ దృక్పధాన్ని, తన వ్రాతల ప్రయోజనాన్ని సవివరంగా జనం ముందు ఉంచారు. 

 

" మనిషిలో అట్టడుగున బురద గుంటలో ఉన్న మనిషిని లేవదీయడం 

 

  ఎముకల లోతుల్లో ధ్వనించే స్వచ్ఛమైన గీతాల్ని ప్రతిధ్వనించడం 

 

  కళ్ళ వెనక దాగి ఉన్న సిసలైన కన్నీళ్లని ప్రసరించడం 

 

  సహజమైన భావాన్ని ఒడుపుగా పట్టడం 

 

  పెదాల కొసల్లో చిక్కటి చిరునవ్వుల్ని మొలిపించడం 

 

  నిజాన్ని నిజంగా నగ్నంగా చెప్పడం " 

 

అన్న పదాలు  వారి కవితా ప్రయోజనాన్ని తెలిపే ప్రయత్నానికి ఒక ఉదాహరణ. 

 

ఈ పరిచయ వాక్యాలు ముగించే ముందు, మరొక్కమాట :

 

దిగంబరకవులు వర్ణించిన సమాజ రుగ్మతలు ఇవాళ్టికీ మనకి అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. కాని వారిలా, లేక వారిలో అరశాతం ఆవేశంతో ప్రతిస్పందించే వారు మాత్రం మనకి కనపడరు. ఇది ఇవాళ మన ముందున్న New Normal.

 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin