parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Poetry of Abburi Ramakrishna Rao | Pathana Kutuhalam Episode - 33

12-10-2021published_dt 2021-10-12T10:07:34.820Z12-10-2021 15:37:34 IST
Updated On 12-10-2021 15:37:58 ISTmodified_dt 2021-10-12T10:07:58.462ZUpdated On 12-10-20212021-10-12T10:07:34.820Z12-10-2021 2021-10-12T10:07:34.820Z - 2021-10-12T10:07:58.462Z - 12-10-2021

అబ్బూరి రామకృష్ణారావు కవితలను, గేయాలను కొన్నింటిని సంకలనం చేసి వెలువరించిన ఉహాగానము ఇతర కృతులు అనే గ్రంధానికి బూదరాజు రాధాకృష్ణ, ఏల్చూరి సుబ్రమణ్యలు రాసిన పరిచయం నుంచి కొన్ని మాటలు మీకు వినిపిస్తా. అబ్బూరి రామకృష్ణారావు బహుముఖ వ్యక్తిత్వాన్ని వారు ఆవిష్కరించిన తీరు నేను మరెక్కడా చూడలేదు. 

వారన్నారు:  "భారతదేశంలో తలమెత్తిన ప్రతి రాజకీయోద్యమంతోను, సాహిత్యోద్యమంతోను, సామాజికోద్యమంతోను వారికి అంతో ఇంతో ప్రత్యక్ష సంబంధముంది. అరవిందుడి వంటి విప్లవకారులనుంచి ఎం.ఎన్.రాయ్ వంటి మేధావుల వరకూ, సనాతన సంస్కృత విద్వత్సభల నుంచి అభ్యుదయ రచయితల మహాసభల వరకూ, సాంప్రదాయిక కావ్యకర్తల నుంచి దిగంబర కవుల వరకూ వారికి నిషిద్ధమేమీ లేదు. ఆంధ్రేతర రచయితలతో, విద్వాంసులతో, కళాకారులతో వారంత పరిచయ స్నేహాలున్న మరో ఆంధ్రసాహితీ పరుడు కనిపించడు. మానవతకు ఇచ్చిన విలువను వారు మానవ దౌర్బల్యాలకు ఇవ్వలేదు. . . .  లోకాన్నీ లోకులను నిర్మోహ సమ్యగ్ దృష్టితో చూడగలరు; నిర్వికారంగా నిర్మమంగా తృణీకరించనూ గలరు. "

అబ్బూరి రామకృష్ణారావు జీవిత సారాన్ని ఈ మాటలు తెలియచేస్తాయి. 

అబ్బూరి రామకృష్ణారావు ఇప్పటి వారికి అట్టే పరిచయం ఉండక పోవచ్చు. ఆయన కవి, రాజకీయ ఉద్యమ కారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, నాటకకర్త, నాటక ప్రయోక్త, సాహితీ సంస్థల నిర్మాత, గ్రంధాలయాధికారి, తెలుగు ప్రాచార్యులు, బహుభాషాకోవిదులు. ఎందరో కవులకు, రచయితలకు మార్గదర్శి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ వంటి వారు వారిని గురువుగా చెప్పుకున్నారు. ఈయన కవితాశిల్పాన్ని వర్ణిస్తూ ఒక విమర్శకుడు అంటారు : 

" అబ్బూరి మాటలను రత్నాలు లాగా పొదుగుతాడు. అతడు శిల్పి " అని. ఎంతో రాయగల శక్తి ఉన్నా చాలా తక్కువ రసారాయన అన్న నిరాశ చాలామంది సాహితీ విమర్శకులలో మనకి గోచరిస్తుంది. ఆధునిక ఆంధ్ర సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పి,  అమితంగా ప్రభావితం చేసిన త్రిమూర్తులలో ఒకరు అబ్బూరి. మిగతా ఇద్దరూ గురజాడ, రాయప్రోలు అని సాహితీ విమర్శకులు తేల్చి చెప్పిన మాట. 

అబ్బూరి రామకృష్ణారావుగారి దృక్పధం, వారి శైలి, మార్గం, కవితావేశం ఇవాళ మనం చదువుకుంటున్న వారి "కవిత" లో మనకు స్పష్టంగా కనపడతాయి. స్వీకరించండి.  

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin