parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Parts from 'Cherakalam' | Abburi Varada Rajeswara Rao | Pathana Kutuhalam Episode - 23

28-07-2021published_dt 2021-07-28T06:54:24.813Z28-07-2021 12:24:24 IST
Updated On 28-07-2021 12:32:36 ISTmodified_dt 2021-07-28T07:02:36.192ZUpdated On 28-07-20212021-07-28T06:54:24.813Z28-07-2021 2021-07-28T06:54:24.813Z - 2021-07-28T07:02:36.192Z - 28-07-2021

అబ్బూరి వరద రాజేశ్వర రావు, మిత్రులకు, సన్నిహితులకు వరద. అత్యంత ప్రతిభాశాలి అయిన కవి.  ఇవాల్టి తెలుగువారికి చాలా మందికి వరద రాజేశ్వర రావు కవిగా తెలియకపోవచ్చు. ఆయన కవిత్వాన్ని వృత్తిగా స్వీకరించి పుంఖాను పుంఖాలుగా వ్రాయకపోవడం బహుశా ముఖ్యమైన కారణం కావచ్చు. కానీ రాసి తక్కువైనా వారి రచనల్లోని ఘాడత, గంభీరత ఆయనివి ఏ రెండు పంక్తులు పట్టుకున్నా మనకి అర్థమైపోతుంది. ఆయన రాసిన చెరకాలం తెలుగు కవితామతల్లికి విలువైన ఆభరణం. ఆయన రాసి 70ఏళ్ళు దాటుతున్నా అందులోని భావాలు ఇవాళ పరిస్థితులను చూస్తే మన మనస్సుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. 

 

''ఈ జగతంతా పెద్ద జైలు, కరిగిపోని కారు మొయిలు. తీయదనం, చేదు, నలుపు, వెలుగు పంచలేని తెలుపు'' 

 

అన్నారాయన. 

 

ఛందోబద్ధ కవిత్వాన్ని, వచన కవిత్వాన్ని కూడా సాధన చేసారు వరద రాజేశ్వర రావు. వరదను ఆశీర్వదిస్తూ పద్యాన్ని భద్రంగా చూడమని విశ్వనాథ రాసిన పద్యం వినండి. 

 

కావ్యమునకు కావ్యమె పూ

 

ర్ణవ్యాఖ్యానమ్మటండ్రు ప్రాజ్ఞులు, 

 

కావ్యమునకు కావ్యమె పూ

 

ర్ణవ్యాఖ్యానమ్మటండ్రు ప్రాజ్ఞులు, యీ నీ 

 

నవ్యకవితాకృతికి సం 

 

భావ్యము పద్యప్రశంస భద్రము వరదా !

 

 

చెరకాలం గురించి శ్రీశ్రీ రాసిన పద్యాన్ని చదివి ఈ ప్రస్తావనను ముగిస్తాను. 

 

 

నీ వ్రాసిన చెరకాలం 

 

తీవ్రంగా చదువ చదువ తెరలెను పరదా 

 

నీ వ్రాసిన చెరకాలం 

 

తీవ్రంగా చదువ చదువ తెరలెను పరదా 

 

నీ వ్రయ్యలైన హృదయపు 

 

చేవ్రాలే కావ్యమై రసించెను వరదా !

 

 

 

 

 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin