22-04-2021published_dt 2021-04-22T09:59:03.774Z22-04-2021 15:29:03 IST Updated On 22-04-2021 15:30:31 ISTmodified_dt 2021-04-22T10:00:31.983ZUpdated On 22-04-20212021-04-22T09:59:03.774Z22-04-2021 2021-04-22T09:59:03.774Z - 2021-04-22T10:00:31.983Z - 22-04-2021
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-04-22T09:59:03.774Z"},{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-04-22T09:59:26.415Z"},{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-04-22T10:00:31.983Z"}],"comments":[],"video_status":"1","view_count":562,"status":"active","_id":"608148e74cc44728d46005a6","category_id":"5c0e2ef31322bc16a77a2cd1","category_name":"Poetry","title":"Paanashala by Duvvuri Ramireddy | Pathana Kutuhalam","metatitle":"Paanashala by Duvvuri Ramireddy | Pathana Kutuhalam","metadescription":"ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి కోకిల దువ్వూరి రామిరెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. కానీ వారికి రావలసినంత ప్రాచుర్యం","metakeywords":"Paanashala by Duvvuri Ramireddy, Pathana Kutuhalam, Paanashala,Duvvuri Ramireddy, Telugu poet, పానశాల, Kavikokila, శ్రీ దువ్వూరి రామిరెడ్డి, Literature, Poetry, కవిత్వం, గేయాలు, కవితలు, Kavitvam, Geyalu, Kavithalu, కవితా సంకలనం, పరకాల, పరకాల ప్రభాకర్","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p style=\"text-align: justify;\">ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి కోకిల దువ్వూరి రామిరెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. కానీ వారికి రావలసినంత ప్రాచుర్యం, కీర్తి రాలేదనే చెప్పుకోవాలి. </p>\r\n<p style=\"text-align: justify;\">ఆయన కేవలం కవి మాత్రమే కాదు. నాటక కర్త, సాహితీ విమర్శకులు, బహు భాషా వేత్త, అనువాదకుడు, సినిమా దర్శకుడు, పాటల, మాటల రచయిత. వీటన్నింటికన్నా ముందు రామిరెడ్డి స్వయంగా హలాన్ని చేతపట్టిన రైతు. వారి కావ్యాలలో కృషీవలుడు, పానశాల వారి పేరును తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపే రచనలు. </p>\r\n<p style=\"text-align: justify;\">పారశీకం నుంచి ఉమర్ఖయ్యాం రుబాయీలను తెలుగు వారికి అందిస్తూ ఆయన రాసిన పద్యం తెలుగు భాష గురించి, పారశీ భాషను గురించి, అనువాదం గురించి ఆయన భావాల్ని మనకు తెలియచేస్తాయి. </p>\r\n<p style=\"text-align: justify;\">\" పారశీ కన్నా శ్రావ్యమయి </p>\r\n<p style=\"text-align: justify;\"> పల్లవ కోమలమై </p>\r\n<p style=\"text-align: justify;\"> సుధారసం బూరెడు మా తెనుఁగు నుడి \"</p>\r\n<p style=\"text-align: justify;\">పారశీకము కన్నా తెలుగు శ్రావ్యమైనదని నిర్మొహమాటంగా కావ్యం ఆదిలోనే తేల్చి చెప్పేసారాయన. ఇక తెలుగు ఎలాంటిది? పల్లవ కోమలమైనది; సుధారసం ఊరెడిది. ఇది ఆయన తెలుగు భాషా ప్రియత్వం. </p>\r\n<p style=\"text-align: justify;\">ఇక ఆయన చేసినది ఉమర్ఖయ్యాం రుబాయిలకు కేవలం అనువాదమా? మక్కికి మక్కి అనువాదం కాదు అని పానశాల కావ్యంలో ఒక్క పద్యం చదివినా ఇట్టే చెప్పేయగలం. తెనుఁగునుడి ఒప్పిదమౌనటు నీదు భావములు ఏరిచి కూరిచితి అని పానశాల కావ్య అనువాద లక్షణాన్ని మనకు తెలియచేశారాయన. తనకు తాను అనువాదకునిగా కాకుండా తిక్కన, శ్రీనాధుల వలె అనువక్తగా తలపోసుకున్నారు రామిరెడ్డి. </p>\r\n<p style=\"text-align: justify;\">దువ్వూరి రామిరెడ్డి భావ సాంద్రతకు, తత్వచింతనా గాఢతకు, మృదుమధుర పద భరిత పద్య రచనా కుశలతకు, ఆచంద్ర తారార్కం తార్కాణంగా నిలిచే పానశాల కావ్యంలో నుంచి కొన్ని భాగాలను ఇవాళ చదువు కుందాం.</p>\r\n<p style=\"text-align: justify;\"> </p>\r\n</body>\r\n</html>","tags":"Pathana Kutuhalam, Paanashala, Duvvuri Ramireddy, Telugu poet, పానశాల, Kavikokila, శ్రీ దువ్వూరి రామిరెడ్డి, Literature, Poetry, కవిత్వం, గేయాలు, కవితలు, Kavitvam, Geyalu, Kavithalu, కవితా సంకలనం, పరకాల, పరకాల ప్రభాకర్","url":"/poetry/paanashala-by-duvvuri-ramireddy-|-pathana-kutuhalam","thumbnailratio":"16_9","english_url":"/poetry/paanashala-by-duvvuri-ramireddy-|-pathana-kutuhalam","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-04-22T09:59:03.774Z","img_alt_description":"Paanashala by Duvvuri Ramireddy | Pathana Kutuhalam","short_description":"ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి కోకిల దువ్వూరి రామిరెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. కానీ వారికి రావలసినంత ప్రాచుర్యం","embedded":"https://www.youtube.com/watch?v=xR5NKb0uX9c","english_title":"Paanashala by Duvvuri Ramireddy | Pathana Kutuhalam","thumbnail1":"/uploads/n8Y1M7Gibp.png","thumbnail2":"/uploads/L3I8uAUU5V.png","thumbnail3":"/uploads/4lXT9HB518.png","__v":0,"modified_dt":"2021-04-22T10:00:31.983Z","editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/poetry/paanashala-by-duvvuri-ramireddy-|-pathana-kutuhalam","published_dt":"2021-04-22T09:59:03.774Z","published_dt_txt":"22-04-2021","published_dt_time_txt":"22-04-2021 15:29:03 IST","updated_dt_time_txt":"22-04-2021 15:30:31 IST"}
ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి కోకిల దువ్వూరి రామిరెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. కానీ వారికి రావలసినంత ప్రాచుర్యం, కీర్తి రాలేదనే చెప్పుకోవాలి.
ఆయన కేవలం కవి మాత్రమే కాదు. నాటక కర్త, సాహితీ విమర్శకులు, బహు భాషా వేత్త, అనువాదకుడు, సినిమా దర్శకుడు, పాటల, మాటల రచయిత. వీటన్నింటికన్నా ముందు రామిరెడ్డి స్వయంగా హలాన్ని చేతపట్టిన రైతు. వారి కావ్యాలలో కృషీవలుడు, పానశాల వారి పేరును తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపే రచనలు.
పారశీకం నుంచి ఉమర్ఖయ్యాం రుబాయీలను తెలుగు వారికి అందిస్తూ ఆయన రాసిన పద్యం తెలుగు భాష గురించి, పారశీ భాషను గురించి, అనువాదం గురించి ఆయన భావాల్ని మనకు తెలియచేస్తాయి.
" పారశీ కన్నా శ్రావ్యమయి
పల్లవ కోమలమై
సుధారసం బూరెడు మా తెనుఁగు నుడి "
పారశీకము కన్నా తెలుగు శ్రావ్యమైనదని నిర్మొహమాటంగా కావ్యం ఆదిలోనే తేల్చి చెప్పేసారాయన. ఇక తెలుగు ఎలాంటిది? పల్లవ కోమలమైనది; సుధారసం ఊరెడిది. ఇది ఆయన తెలుగు భాషా ప్రియత్వం.
ఇక ఆయన చేసినది ఉమర్ఖయ్యాం రుబాయిలకు కేవలం అనువాదమా? మక్కికి మక్కి అనువాదం కాదు అని పానశాల కావ్యంలో ఒక్క పద్యం చదివినా ఇట్టే చెప్పేయగలం. తెనుఁగునుడి ఒప్పిదమౌనటు నీదు భావములు ఏరిచి కూరిచితి అని పానశాల కావ్య అనువాద లక్షణాన్ని మనకు తెలియచేశారాయన. తనకు తాను అనువాదకునిగా కాకుండా తిక్కన, శ్రీనాధుల వలె అనువక్తగా తలపోసుకున్నారు రామిరెడ్డి.
దువ్వూరి రామిరెడ్డి భావ సాంద్రతకు, తత్వచింతనా గాఢతకు, మృదుమధుర పద భరిత పద్య రచనా కుశలతకు, ఆచంద్ర తారార్కం తార్కాణంగా నిలిచే పానశాల కావ్యంలో నుంచి కొన్ని భాగాలను ఇవాళ చదువు కుందాం.