parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Motu Manishi by K. N. Y. Patanjali | Pathana Kutuhalam Episode - 26

18-08-2021published_dt 2021-08-18T05:22:50.319Z18-08-2021 10:52:50 IST
Updated On 18-08-2021 10:54:20 ISTmodified_dt 2021-08-18T05:24:20.213ZUpdated On 18-08-20212021-08-18T05:22:50.319Z18-08-2021 2021-08-18T05:22:50.319Z - 2021-08-18T05:24:20.213Z - 18-08-2021

KNY పతంజలి - కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి విలక్షణమైన రచయిత. కథకుడు, పాత్రికేయుడు, సినిమాకు సంభాషణలు కూడా రాసారు. హాస్య, వ్యంగ్య రచనలలో గురజాడ, చాగంటి సోమయాజులు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి లకు వారసుడు అని చెప్పుకోవచ్చు. విశ్వ సాహిత్యాన్ని విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేసిన సాహితీ పిపాసి. జీవితాన్ని పతంజలి చూసిన కోణం అర్థమవ్వాలంటే అయన వేట కథలు, గెలుపు సరే, బతకడం ఎలా వంటి వ్యాసాల సంకలనం, పిలక తిరుగుడు పువ్వు వంటి నవల చదివి తీరాల్సిందే. 

"నా కన్నా ముందు తెలుగులో ఎందరో మహా రచయితలున్నారు. వారందరి నుంచి నేను నేర్చుకున్నాను. గురజాడ, రావిశాస్త్రి నా మీద బాగా ప్రభావం చూపించిన రచయితలు" అని తన రచనా వ్యాసంగం గురించి నమ్రతతో చెప్పుకున్నారు పతంజలి. చెడును, దుర్మాగాన్ని వెక్కిరించే రచనలు పతంజలివి. అన్యాయాన్ని బజారుకీడ్చి నడిరోడ్డులో నిలబెట్టేవి ఆయన వ్యాసాలు. తన చుట్టూ ఉన్న మనుష్యుల వ్యక్తిత్వాల నుంచి, పరిస్థితుల నుంచి తను నేర్చుకున్నవి, గమనించినవి తను సృష్టించిన పాత్రలలోను, తానల్లిన సన్నివేశాలలోను ప్రతిబింబింపచేస్తారు  పతంజలి. చివరకు తన వ్యక్తిత్వంలోని కొన్ని పార్శ్వాలను కూడా ఆయన రచనల్లో లీలగా గోచరింపచేస్తారు. 

56 సంవత్సరాలకే పతంజలి కన్నుమూసారు. ఇవాళ ఆయన కథ మోటు మనిషి చదువుకుందాం. 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin