parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Maha Shunyam by Deerghasi Vizai Bhaskar Part-01| Pathana Kutuhalam Episode - 34

12-10-2021published_dt 2021-10-12T10:15:22.496Z12-10-2021 15:45:22 IST
2021-10-12T10:15:22.496Z12-10-2021 2021-10-12T10:15:22.496Z - - 18-10-2021

దీర్ఘాశి విజయభాస్కర్ గారిది కవిగా కొత్త గొంతుకనే చెప్పాలి. వీరు సుప్రసిద్ధ నాటక రచయిత, కథకులు, వ్యాసకర్త, నాటక రచయితగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. రుత్విక్, కించిత్ భోగం, మబ్బుల్లో బొమ్మ, మినిస్టర్, బ్రహ్మరాత, గాంధీ జయంతి వీరు రాసిన నాటకాలలో కొన్ని. వీరి నాటకాలు ఇంగ్లీషు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, మణిపూరి భాషల్లోకి అనువాదమై ప్రదర్శించబడ్డాయి. 

వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖకు నాయకత్వం వహించి ఈ మధ్యలోనే పదవీ విరమణ చేసారు. 

ఒక మనిషి అంతరిక్షంలో నిలబడి విశ్వాన్నంతా కలయ చూసే అవకాశం వస్తే కాలాన్ని  మొదటి నుంచి చివరి వరకూ దర్శిస్తే ఎటువంటి భావుకతని, తత్వ జ్ఞానాన్ని, చరా చర ప్రపంచం మీద అవగాహనను సాదించుకోగలుగుతాడో అటువంటి విస్తారమైన, గాడమైన, లోతయిన అవగాహన ఈ కవికి సిద్దించాయా అనిపిస్తుంది వారి కవితలు మనం చదివితే. ఇవి మొట్టమొదటి సారిగా నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ మాటలు నేను ఎందుకు అన్నానో విజయ భాస్కర్ కవితలు విన్న తర్వాత మీకు అర్థమవుతుందని ఆశిస్తాను. సమాజంలో, ఒక దేశంలోనో, కాలంలోనో, కొన్ని పరిస్తితుల్లోనో నిలబడిన వ్యక్తి కాదు విజయభాస్కర్  కవితా వస్తువు. అనంత విశ్వంలో పుట్టక ముందు, పుట్టిన తర్వాత, గిట్టే సమయంలో, గిట్టిన తర్వాత మనషి స్థితి గతులు, మానసిక భౌతిక అవస్థలు ఈయన కవితా వస్తువులు. వాటిని పదునుగా వ్యక్తీకరించే భాషా సంపద విజయభాస్కర్ కు ఉంది. 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin