parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Kagitam Mukkalu, Gaju Penkulu by Buchi Babu | Pathana Kutuhalam Episode - 25

18-08-2021published_dt 2021-08-18T05:13:26.644Z18-08-2021 10:43:26 IST
2021-08-18T05:13:26.644Z18-08-2021 2021-08-18T05:13:26.644Z - - 18-10-2021

తెలుగు కథను మనుషుల మనసుల లోతుల్లోకి తీసుకువెళ్లిన కథకుడు బుచ్చిబాబు. అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. Stream of Consciousness, చైతన్య స్రవంతిని తెలుగు పాఠకులకు మొట్ట మొదటగా పరిచయం చేసింది బుచ్చిబాబు. అయన పాత్రలు మానవ ప్రకృతిని తర్కింకి, తరచి చూసి, లోతుగా చర్చించి అందులో కొత్త కోణాలను మనముందు ఆవిష్కరిస్తాయి. అయన నవల 'చివరకు మిగిలేది' అందుకు ప్రధాన తార్కాణం. ఎన్ని సార్లు చదివితే అన్ని సార్లు కొత్త అర్ధాలను స్ఫురింపచేసే రచన అది. 

తెలుగులో ఆయన బుచ్చిబాబు పేరుతో రచనా వ్యాసంగం సాగిస్తే, అడపాదడపా ఇంగ్లీషులో 'సంతోష్ కుమార్' అనే పేరుతో రచనలు చేసారు. సుమారు 80 కథలు రాసారు. బుచ్చిబాబు నాటకకర్త, వ్యాస కర్త కూడా. దాదాపు 40 వ్యాసాలు, నాటికలు/నాటకాలు కలిపి 40 దాకా వ్రాసారు. వచన కవిత తో కూడా ప్రయోగాలు చేసారు. వారి నాటకం ఆత్మవంచన, వచన కావ్యం అజ్ఞానం ప్రసిద్ధ మైనవి. షేక్స్పియర్ రచనల మీద ఆయన వ్రాసిన విమర్శనాత్మక వ్యాసం ఇంగ్లీషు సాహిత్యం పట్ల ఆయనకున్న విస్తృత అవగాహనను తెలియచేస్తుంది. స్వీయ చరిత్రకు ఉపక్రమించి కొంత భాగం మాత్రమే అందించగలిగారు. 'నా అంతరంగ కథనం' వారు మనకు మిగిల్చిన ఆత్మకథలోని భాగం. కొన్నాళ్ళు english lecturer గా పనిచేసినా, ఎక్కువ కాలం - సుమారు పాతికేళ్ళు ఆకాశవాణిలో పని చేసారు. 

ఇవాళ వారి కథ కాగితం ముక్కలు, గాజు పెంకులు చదువుకుందాం.  

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin