parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Jaagte Raho by Sivasagar ( K.G. Satyamurthi ) | Pathana Kutuhalam Episode - 21

20-07-2021published_dt 2021-07-20T12:05:48.061Z20-07-2021 17:35:48 IST
Updated On 20-07-2021 17:59:37 ISTmodified_dt 2021-07-20T12:29:37.514ZUpdated On 20-07-20212021-07-20T12:05:48.061Z20-07-2021 2021-07-20T12:05:48.061Z - 2021-07-20T12:29:37.514Z - 20-07-2021

కె. జి. సత్యమూర్తి. అయన కలం పేరు శివసాగర్. శివసాగర్ జీవితాన్ని రెండు మాటల్లోకి కుదించాలంటే ఆ మాటలు: అన్వేషణ, గవేషణ. 

సమాజాన్ని మార్చడానికి ఆయనది నిరంతర మార్గాన్వేషణ. అసమానత, కుల వ్యవస్థ, విచక్షణ, భారతీయ సమాజంలో వాటి మూలాలు ఆయన గవేషణ పరమార్ధాలు.    

ఉద్యమ నిర్మాణం, ఆ ఉద్యమ ప్రాతిపదికకు సిద్దాంత సూత్రీకరణ, ఈ రెంటికి తోడుగా కవితా వ్యక్తీకరణ - ఈ మూడూ ఒక మనిషిలో ఉండటం అరుదు . ఆ మూడింటిని సమాన సామర్ధ్యంతో నిర్వహించిన అత్యంత అరుదైన వ్యక్తి కె. జి. సత్యమూర్తి.  ఆయన జాగ్తే రహో కవితా సంకలనానికి ముందుమాటలో ఎన్ అంజయ్య రాసిన మాటలో సత్యమూర్తిని విప్లవాన్ని కవిత్వీకరించి కవిత్వాన్ని దళితీకరించిన  వారిగా అభివర్ణిస్తారు. ఇది అక్షర సత్యం. ఇక వరవర రావు తన ముందు మాటలో శివసాగర్ కవితా తత్వాన్ని, శిల్పాన్ని ఈ విధంగా మదింపు వేశారు. " గురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్ మొదలు దిగంబర కవులు కవిత్వంలో చేసిన శిల్ప ప్రయోగాల్లోని మేలిమినంతా స్వీకరిస్తూ గురజాడలోని ప్రజాస్వామిక దార్శనికనూ, శ్రీశ్రీలోని తిరుగుబాటు వేదాంతాన్ని, తిలక్లోని భావుకతను, దిగంబరకవులలోని ధిక్కారాన్ని, నక్సల్ బరీతో వచ్చిన గుణాత్మకమైన విప్లవ మార్పులో విప్లవాన్ని సాయుధం చేసిన వాడు శివసాగర్  ". 

ఇవాళ సత్యమూర్తి, అదే శివసాగర్, కవితావేశాన్ని పరిచయం చేసుకుందాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin