parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Gunturu Seshendra Sarma's Nā Desam-Nā Prajalu ‘Ādhunika Mahābhāratam-Part 02 | Pathana Kutuhalam -31

23-09-2021published_dt 2021-09-23T07:35:47.913Z23-09-2021 13:05:47 IST
2021-09-23T07:35:47.913Z23-09-2021 2021-09-23T07:35:47.913Z - - 01-12-2021

గుంటూరు శేషేంద్ర శర్మ అసాధారణ ప్రతిభాశాలి. వాల్మీకి మహర్షి మంత్ర శాస్త్ర రహస్యాలను రామాయణ కావ్యంలో ఎలా పొదిగారో వివరించే షోడశి రాసిన కలంతోనే 

 

" నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు 

 

  కానీ కలమెత్తితే నాకు 

 

  ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంది "

 

అని రాయగలిగిన వైవిధ్య భరిత ప్రజ్ఞా మూర్తి. 

అలంకార శాస్త్రంలో, ఆర్ష విజ్ఞాన సాహిత్యంలో, మంత్ర శాస్త్రంలో ఎంత లోతైన అధ్యయనం ఉందో, విశ్వ సాహిత్యం మీద అంత గాఢమైన అవగాహాన ఉన్న మహాపండితుడు శేషేంద్ర శర్మ.  ఛందోబద్ధ పద్యం ఎంత సుందరంగా చెప్పగలడో, రచన కవితను అంత పదునుగానూ మలచగల నేర్పరి. 

ఆయన కాలరేఖ, సాహిత్య కౌముదులు పూర్య, ఆధునిక తెలుగు కవిత్వం మీద ఆయన సాధికార విమర్శలు. ఆధునిక మహాభారతం కావ్యం ఆయన రాసిన అనేక కవితల సంకలనం కాదు. " ఇది నా కావ్య సంకలనం కాదు. ఇది నా కావ్యం. నా సంపూర్ణ కావ్యం " అని స్పష్టంగా అవతారికలో తేల్చి చెప్తారాయన. 

నా దేశం - నా ప్రజలు అనే ఆధునిక మహా భారతం కావ్యానికి ఫలశృతి ఉంది. శేషేంద్ర శర్మ మాటల్లో ఆ ఫలశృతి ఇది :

ఆధునిక మహా భారతం వింటే, గులాం మనస్తత్వ కారణంగా వంగిపోయిన మోకాళ్లలో బలం వచ్చి మనిషి కాళ్ళు నిటారుగా నిలుస్తాయి. దాని పైన, వంగి వంగి సలాములు చేసి చేసి వంకర టింకర్లు  అయిపోయిన వెన్నెముక ఇనుప చువ్వలా నుల్చుంటుంది. సిగ్గు విడిచి, తలా వంచి వంచి మెలిగే అలవాటు చేత సదా వేలాడే తల ఒక్కసారి భుజాలమీద లేచి నిర్భయంగా నిలబడుతుంది. మనిషి మనిషిగా మారిపోతాడు ; భూగోళానికి ఇరుసు అవుతాడు. రండి ఇవాళ గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక మహా భారతంలోకి అడుగు పెడదాం. 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin