parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Dharmavaddi by Tripuraneni Gopichand | Pathana Kutuhalam

16-04-2021published_dt 2021-04-16T10:17:19.964Z16-04-2021 15:47:19 IST
2021-04-16T10:17:19.964Z16-04-2021 2021-04-16T10:17:19.964Z - - 18-06-2021

త్రిపురనేని గోపీచంద్ కేవలం కథా రచయితే కాదు. ఒక పరిణితి చెందిన తత్వవేత్త. జిజ్ఞాసువు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తత్వ దర్శనాలను ఆసక్తితో పరామర్శించి, లోతుగా అధ్యయనం చేసి, పూర్వ పక్షం చేసిన మేధావి. అయన రచనలలో ఆయన చేసిన అధ్యయన గాఢత స్పష్టంగా కనపడుతుంది. సూక్ష్మమైన మానసిక విశ్లేషణ గోపీచంద్ రచనలలో మనకి దర్శనమిస్తుంది. చాలా నిరాడంబరమైన శైలి. నిరాడంబరమైన భాషతో పాత్రల గాఢతను పాఠకులకు అధించగలిగిన చాలా కొద్దిమంది రచయితలలో గోపీచంద్ ఒకరు. మనుష్యుల గురించి మానవ సమాజం గురించి గోపీచంద్ అవగాహన ఆయన రచనలలో, పాత్రల చిత్రీకరణలో ఇమిడిపోతుంది. అయన కథన శిల్పం ప్రవచన పద్దతిని అవలంబించదు. ఇదిగో ఇలా మసులుకోండి అని పాఠకులకు నేరుగా చెప్పదు. పాత్రల సంభాషణలు, సన్నివేశాలు, సంఘటనలు, అవి జరిగిన క్రమం, వాటి పర్యవసానాలు పాఠకులను ఆలోచింపచేసి, వారికి వారే తమ తమ దృక్పధాల్ని నిర్ధేశించుకునేలా చేస్తాయి.

" మానవులు జీవ నదులు లాగ ఉండాలి " అని గోపీచంద్ ఆశయం. జీవితం ఒక తాత్విక అన్వేషణ అని అయన నమ్మకం.

ఈ కథ ' ధర్మవడ్డీ ' లో పాత్రల సంభాషణ, సంఘటనలు, సామాజిక వాస్తవాలను మనకి చూపించడమే కాకుండా సూరయ్య మానసిక స్థితిని మనకి అందించిన తీరు గోపీచంద్ కథనా శిల్ప చాతుర్యాన్ని మనకు తెలియచేస్తాయి. ఈ కథ ద్వారా గోపీచంద్ ప్రజ్ఞను పరిచయం చేసుకుందాం!

 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin