parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Chalam's Short stories | Pathana Kutuhalam Episode - 6

06-07-2021published_dt 2021-07-06T19:02:24.528Z07-07-2021 00:32:24 IST
2021-07-06T19:02:24.528Z06-07-2021 2021-07-06T19:02:24.528Z - - 18-01-2022

తెలుగు పాఠక లోకాన్ని, తెలుగు సమాజాన్ని కొన్ని దశాబ్దాల పాటు కుదిపేసిన రచయిత, నాటక కర్త, నవలా రచయిత, కవి, గుడిపాటి వెంకట చలం, పాఠకలోకానికి చలం. చలం లాగ వాక్యం రాయాలని  ధ్యేయంగా పెట్టుకుని సాధన చేసిన రచయితలు అనేక మంది. 

చలం భావాలతో ఏకిభవించని వారు కూడా అయన ప్రభావం నుంచి   తప్పించుకోలేక పోయారు.  

మన సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయం, స్త్రీ ని బంధించిన సంకెళ్లు, స్త్రీ స్వాతంత్య్రం, స్త్రీ మీద శారీరక, మానసిక హింస, ఇవి  చలం ఇతివృత్తాలు.  అయన భావాలు, వ్యక్తి గత ప్రవర్తనల వల్ల ఆయనను " విపరీత వ్యక్తిగా " సమాజం ముద్ర వేసి వెలివేసింది.  సూటిగా, పదునుగా వ్యావహారిక పదాలతో కూడిన ఆయన వాక్యాలు ఆయన ఆయుధాలు. జలపాతంలా దూకుతుంది అయన కథనం. 

ఆయన సృష్టించిన అరుణ, అమీనా లాంటి పాత్రలు ఇవాల్టికీ తెలుగు సాహిత్యంలో వాటి  ప్రభావాన్ని కోల్పోలేదు. తను రాసినవన్నీ తనకోసం రాసుకున్నవని చెప్పుకున్నాడు చలం.  తనలోని కుళ్ళును ఎత్తి చూపించడానికి, తనలో ఏమూలనో మిగిలి ఉన్న చెడును విమర్శించడానికి రాస్తే, ఇతరులు, చలం తమని తిట్టాడు అనుకున్నారు, అన్నాడు తను రాయడం ఆపేసి ఆధ్యాత్మిక మార్గం పట్టిన తర్వాత చలం 

" ఏదో ఒక కాయితం, ఏదో ఒక పాత కలం చేత పట్టుకుని కూర్చో.  ఏదన్నా కథ వచ్చిందా రాయి. రాలేదా, కాయితం చించేసి రాజకీయ నాయకుడువయ్యే ప్రయత్నం చేసుకో," అన్నాడాయన. 

కథ పత్రికలు అచ్చు వెయ్యకపోతే " వాటినో కవరులో పెట్టి ముందు తరాల కోసం దాచెయ్యి". అన్నది అయన కథారచయితల కిచ్చిన సందేశం. 

ఇవాళ చలం కథనా శిల్పాన్ని ఆస్వాదిద్దాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin