parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Amaravati Kathalu by Satyam Sankaramanchi | Pathana Kutuhalam Episode - 4

06-07-2021published_dt 2021-07-06T18:43:40.818Z07-07-2021 00:13:40 IST
2021-07-06T18:43:40.818Z06-07-2021 2021-07-06T18:43:40.818Z - - 18-01-2022

ప్రతి తెలుగు వారు చదివి తీరాల్సిన కథలు అమరావతి కథలు. ఇవి వంద కథలు. చిన్న చిన్నవి. ఒక్కొక్క పదం తూకం వేసి వాడినట్లుగా ఉంటుంది సత్యం శంకరమంచి వాక్య నిర్మాణం. నిరాడంబరంగా, సూటిగా లోతైన సత్యాలను సత్యం గారు చెప్పినట్లు చెప్పగలగడం చాలా తక్కువ మందికే సాధ్యం. ప్రతి కథను ముగించిన తీరులో శంకరమంచి తన ప్రత్యేకతను చాటుతారు. అమరావతి కథలు సంకలనానికి ముందు మాటలో ముళ్ళపూడి అన్న పలుకులు సత్యం శంకరమంచి కథనా శిల్పానికి అద్దం పడతాయి. 

"అమరావతి కథలు ప్రేమతో, భక్తితో ఆవేశంతో సత్యంగారి హృదయంలో నుంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరుగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి", అన్నారు రమణ. 

వంద అమరావతి కథల్లోంచి సత్యం శంకరమంచి కథనా శిల్పాన్ని దర్శించుకుని వారి సాహితీ సృష్టిని ఆస్వాదించడానికి ఇవాళ మచ్చుకి  కొన్ని కథలు మీకు అందిస్తున్నాను.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin