parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Fidelu Ragala Dozen by Pattabhi - Part 01 || Pathana Kutuhalam Episode - 29

16-09-2021published_dt 2021-09-16T05:56:02.331Z16-09-2021 11:26:02 IST
Updated On 16-09-2021 11:34:09 ISTmodified_dt 2021-09-16T06:04:09.462ZUpdated On 16-09-20212021-09-16T05:56:02.331Z16-09-2021 2021-09-16T05:56:02.331Z - 2021-09-16T06:04:09.462Z - 16-09-2021

తెలుగు కవితా జగత్తులో పఠాభి అంత వివాదాస్పద కవి బహుశా మరొకరు లేరేమో. అటు భావకవులు, సంప్రదాయకవులు, ఇటు అభ్యుదయవాదులూ పఠాభి మీద దుమ్మెత్తి పోసారు. తిక్కవరపు పఠాభి రామిరెడ్డి తనను తాను పఠాభిగా పిలుచుకున్నాడు. విశ్వనాథ సత్యనారాయణ దాన్ని కూడా తప్పుపట్టారు. ఆయనంటారు: " పట్టాభి పఠాభి అయింది. రెండు టాలు ఎందుకని ఒత్తు ఠా పెట్టాడు. " అంటూ అయన విమర్శ గుప్పించడం ప్రారంభిస్తారు. చలం, శ్రీశ్రీ వంటివారు పఠాభి కవిత్వాన్ని ఆహ్వానించారు. ఆరుద్ర తన మీద పఠాభి ప్రభావం, ముద్ర గాఢంగా ఉన్నాయని బహిరంగంగా ప్రకటించుకున్నాడు. దువ్వూరి రామిరెడ్డి వంటి వారు పఠాభిని దుయ్యబట్టారు. సినారాయణ రెడ్డి, కే.వి రమణారెడ్డి, వెల్చేరు నారాయణరావు వంటి సాహితీ విమర్శకులు పఠాభిది అవాంఛనీయ ధోరణి అని  వారి వారి దృక్కోణాల నుంచి విమర్శించి తీర్పు చెప్పారు. 

పఠాభి తన ఫిడేలు రాగాల డజన్ పుస్తకాన్ని ముద్రించిన తీరు, కవర్ పేజీ రూపొందించిన పద్దతి, పదాలను, అక్షరాలను విడగొట్టిన విధానం, వాడిన అలంకారాలు, ఎంచుకున్న కవితా వస్తువు - అన్నీ విపరీతమైన విమర్శకు గురయ్యాయి. అయితే పఠాభి వీటన్నింటినీ చాలా హుందాగా స్వీకరించాడు, ఆహ్వానించాడు కూడా. పైపెచ్చు ఆయన మీద పడ్డ పూలనూ, రాళ్లను ఒకచోట చేర్చి ప్రచురించడానికి కూడా అనుమతించి సహకరించాడు. 1972 లో "Thirty Years Ago " అనే శీర్షికతో తన కవితల పునర్ముద్రణ సందర్భంగా అయన వ్రాసిన ముందు మాటలో ఆయనంటాడు "I was prepared for even abuse. Abuse would have served my purpose admirably. It is apathy that kills." తన కవితా పంధా సృష్టించిన తుఫాను ఆయనకు రుచించింది. 

 

తన కవితా పరమార్ధాన్ని నిష్కర్షగా వెలిబుచ్చారాయన: 

 

"నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో 

పద్యాల నడుముల్ విరగదంతాను; 

చిన్నయ్ సూరి బాల వ్యాకరణాన్ని 

చాల దండిస్తాను: "

 

అని చెప్పుకున్నాడాయన. 

 

" భావికవి న్మాత్రము కాన్నే, నే నహంభావ కవిని " అని తన గురించి తాను చెప్పుకున్నాడు, "ఆత్మకథ" అనే కవితలో. 

శాంతినికేతన్ లో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో చదువుకున్నాడు పఠాభి. తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో; అప్పుడే ఆయన తిరుగుబాటు తత్వానికి బీజాలు పడ్డాయి. 

ఆయన కన్నడంలో నిర్మించిన సంస్కార సినిమా అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. ఆయన తెలుగు కవితా వ్యాసంగం ఎక్కువభాగం 1938-39 ప్రాంతంలో జరిగింది. 

ఇవాళ ఆయన కవితల్ని కొన్ని చదువుకుని ఆరోజుల్లో అవి సృష్టించిన తుఫానును ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin