parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.ఆర్ఎస్ఎస్: సంస్థ బలీయం - దృష్టి సంకుచితం || పరకాలమ్ -3

30-10-2021published_dt 2021-10-30T10:07:49.719Z30-10-2021 15:37:49 IST
Updated On 03-11-2021 15:44:30 ISTmodified_dt 2021-11-03T10:14:30.295ZUpdated On 03-11-20212021-10-30T10:07:49.719Z30-10-2021 2021-10-30T10:07:49.719Z - 2021-11-03T10:14:30.295Z - 03-11-2021

నమస్తే. పరకాలమ్ కు స్వాగతం.

ఆర్ ఎస్ ఎస్ - రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ - సర్ సంఘ్ చాలక్ ప్రతి సంవత్సరం విజయ దశమి రోజు చేసే ప్రసంగం చాలా ముఖ్యమైనది. హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా పనిచేస్తున్న లక్షలాదిమంది స్వయంసేవకులకు ఆ ప్రసంగంలో ఆయన మార్గదర్శనం చేస్తారు. ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, మన సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి ఎలా ఆలోచించాలో ఆ ఉపన్యాసంలో వివరంగా తెలియజేస్తారు. విజయ దశమి, ఆర్ ఎస్ ఎస్ వ్యస్థాపక దినం. ఆ రోజు తమ ఉద్యమ ఎజెండాను, వచ్చే ఏడాదిలో తమ కార్యచరణ ఎలా ఉండబోతోందో దాని ప్రాతిపదిక ఏమిటో వివరిస్తారు. ఇక స్వయం సేవకులు కాని వారికి ఆ ప్రసంగం వింటే ఆ సంస్థ ఆలోచనా సరళి మీద అవగాహన ఏర్పడుతుంది. అది వింటే, ఆర్ ఎస్ ఎస్ వారు మన సమాజం, మన రాజకీయ వ్యవస్థలు ఎదుర్కొనే సమస్యల్లో ఏవి ముఖ్యమైనవి  అనుకుంటున్నారో కొంత అవగాహన కలుగుతుంది. ఆర్ ఎస్ ఎస్ అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రసంగం లో సర్ సంఘచాలక్ ప్రస్తావించిన అంశాలు ఎంత ముఖ్యమో, ఆయన వేటిని ప్రస్తావించకుండా వదిలేసారో గమనించడం కూడా అంతే ముఖ్యం. ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ చేసిన విజయదశమి ప్రసంగం నాకెలా అర్ధమయ్యిందో ఇవాళ మీకు వివరిస్తాను. ఆర్ ఎస్ ఎస్ వెబ్సైట్ లో పెట్టిన వారి ప్రసంగపాఠం లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. కాస్త టైం తీసుకుని చదవండి. 

తన విజయదశమి ప్రసంగంలో సర్ సంఘ చాలక్ స్పృశించిన అన్ని విషయాలూ ముఖ్యమైనవే. అయితే వాటిల్లోంచి నేను ఇవాళ రెండు విషయాల మీద నా వ్యాఖ్యానం మీ ముందుంచుతాను. అవి, జాతీయ జనాభా విధానం, దేశ ఆర్థిక విధానం. వారి ప్రసంగం లో కోవిడ్ పై పోరాటం, ఆరోగ్యం పై భారతీయ ఆలోచనా విధానం, ఆర్థిక వ్యస్థ మీద భారతీయ దృష్టికోణం వంటి అంశాలమీదకూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దేశ వాయువ్య సరిహద్దులకవతల జరుగుతున్న పరిణామాల మీద కూడా ఆయన తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇంతవరకూ బాగానే ఉంది. కాని, దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, ప్రబలుతున్న నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న దుస్సహమైన పరిస్థితులు, వేలకోట్ల విలువైన మాదక ద్రవ్యాలు ఇటీవల దేశంలో దొరకడం, కోవిడ్ మృతుల శవాలు పవిత్ర గంగా నదిలో తేలుతూ మనకు కనపడ్డం, మన భూభాగంలోకి చైనీయులు చొరబడడం - ఎందుకో ఇలాంటివేమీ సర్ సంఘ్ చాలక్ గారికి ముఖ్యమైనవిగా కనిపించి నట్టులేదు. అవి ఆయన ప్రసంగం లో కనీసం ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. 

జాతీయ జనాభా విధానం గురించి మాట్లాడుతూ,

 "దేశ అభివృద్ధి గురించి ఆలోచించినప్పుడు ఒక సంకట పరిస్థితి మనకి కనబడుతుంది. అది చాలా మందిని కలవర పెడుతోంది. దేశ జనాభా బాగా పెరుగిపోతుండడం వల్ల సమీప భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది." 

అన్నారాయన. అయితే దేశ జనాభా విపరీతంగా పెరిగిపోవడం లేదన్నది మన కళ్ళ ముందున్న వాస్తవం. మనం 2.2 పునరుత్పత్తి రేటును Total fertility rate - TFR - చేరుకున్నాము. నిరుడు భారత ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో దేశం జనాభా విషయంలో కుదుటపడింది అని స్పష్టంగా పేర్కొంది. జనాభా పెరుగుదల జరగడం లేదని నిస్సందేహంగా తెలిసినప్పుడు ఆ విషయంలో ఆందోళన చెందుతున్నవారెవరో మనకు అర్ధం కాదు. అయితే సర్ సంఘ చాలక్ 2015 లో రాంచీ లో జరిగిన అఖిల భారతీయ కార్యకారిణీ మండల్ తీర్మానం నుంచి ఉటంకించడం మొదలు పెట్టగానే ఆయన అంతరంగం బయటపడుతుంది. ఆ తీర్మానం నుంచి ఆయన చదివిన భాగాం ఇలా సాగుతుంది: 

"వివిధ మతాలకు చెందిన వారి జనాభా పెరుగుదల రేట్లలో పెద్ద ఎత్తున తేడాలు ఏర్పడుతున్నాయి. దేశం లోకి చొరబాట్ల వల్ల, మత మార్పిడులు జరగడం వల్ల మన జనాభా నిష్పత్తిలో అసమానతలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో దేశ సమైక్యతకూ, సమగ్రతకు, జాతి సాంస్కృతిక అస్తిత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది." పైన చదివిన కార్యకారిణి తీర్మానం లో మూడు అంశాలున్నాయి. వివిధ మతాలకు చెందిన జనాభాల వృద్ధి రేటులో చాలా వ్యత్యాసం ఉన్నదనేది మొదటిది. విదేశాల నుండి చొరబాట్లు జరుగుతున్నాయి అనేది రెండవది. మూడోది మత మార్పిడులు జరుగుతున్నాయి అనేది. చొరబాట్లు దేశ సరిహద్దుల్లో మన గస్తీ వ్యవస్థకు సంబంధించిన విషయం. జాతీయ జనాభా విధానానికి ఏ విధంగానూ సంబంధమున్నది కాదు. దాన్ని పక్కన పెడితే, ఇక మిగిలేవి మొదటి అంశము, మూడో అంశము. మత మార్పిడుల విషయం మత స్వేఛ్ఛ పై మనమవలంబించే దృక్పథానికి సంబంధించినది.ఈ రెంటిపైన ఇప్పుడు దృష్టి పెడదాం. 

మొదటి అంశాన్ని ముందుగా తీసుకుందాం. జనాభా పునరుత్పత్తి రేటుకు - Total Fertility Rate - సంబంధించిన గణాంకాలు మన దగ్గర 1950 నుంచి అందుబాటులో ఉన్నాయి. పిల్లల్నికనే వయసులో ఉన్న మహిళలు ప్రసవించే మొత్తం పిల్లల సంఖ్య సగటును తీసిదానిని పునరుత్పత్తి రేటుగా పరిగణిస్తారు. గణాంకాలు ఇవిగో ఇక్కడ ఇస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. 1950 లో TFR 5.9 ఉంది. 1956 లోనూ అక్కడే 5.9 దగ్గరే ఉంది. 1957 లో స్వల్పంగా 0.1 తగ్గింది. 1965 వరకూ 5.7 దగ్గరే ఉంది.

లఖింపుర్ ఖెరీ దారుణం: మోదీ బీజేపీల మన్ కి బాత్ ఇదేనా? 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin