parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Vendi Kancham by Munimanikyam Narasimha Rao | Pathana Kutuhalam

28-04-2021published_dt 2021-04-28T09:21:14.455Z28-04-2021 14:51:14 IST
2021-04-28T09:21:14.455Z28-04-2021 2021-04-28T09:21:14.455Z - - 18-06-2021

తెలుగు సాహిత్యంలో సున్నితమైన హాస్యానికి చిరునామా మునిమాణిక్యం నరసింహారావు. ఆయన సృష్టించిన సగటు మధ్య తరగతి ఇల్లాలు పాత్ర కాంతం మనందరికీ చిరపరిచితురాలుగా కనబడుతుంది. కాంతం సంసారంలోని ఘట్టాలు, కష్ట సుఖాలు, వాటిని అధిగమించే ప్రయత్నంలో భార్యా భర్తల మధ్య జరిగే సంభాషణలు, కీచులాటలు, దిగువ మధ్య తరగతి సంసారుల ఆశలు, ఆశయాలు, జీవితం నెట్టుకు రావడానికి వారు పడే ఆయాసాలు మునిమాణిక్యం ఇతి వృత్తాలు.

వీటన్నింటికి హాస్యాన్ని జోడించి చెప్తూ మునిమాణిక్యం నర్మగర్భంగా మధ్యతరగతి జీవితాలలోని కఠోర వాస్తవాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ప్రతి వారినీ ఉలిక్కి పడేటట్లు చేస్తుంది వారి హాస్యం. అది కేవలం వినోదం కోసమో, కాలక్షేపం కోసమో, కొంత సేపు నవ్వుకుని వదిలేసేందుకు సృష్టించిన హాస్యరసం కాదు. జీవిత సత్యాలను ఆవిష్కరించేందుకు మునిమాణిక్యం ఎంచుకున్న సాధనం హాస్యం.

భర్తృహరి సుభాషితానికి పేరడీలా మునిమాణిక్యం అప్పు తీర్చడం గురించి చెప్పిన మాటలు వారి సున్నితమైన హాస్యానికి మచ్చుతునకలు. వారంటారు, " అప్పు చేసిన మొత్తమును తిరిగి ఇచ్చేవాడు అధముడు. కాలం గడిపేవాడు మధ్యముడు. తెచ్చిన మరుక్షణములో ఆ విషయం సులువుగా మరవగలిగిన వాడు ఉత్తముడు ". ఎంత వెటకారం ఉందో చూడండి ఇందులో. వీరిని చదువుతున్నప్పుడు Northcote Parkinson రచనలు గుర్తొస్తాయి నాకు.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin