parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Pasidi Gulabi by Ichapurapu Jagannadha Rao | Pathana Kutuhalam -41

13-12-2021published_dt 2021-12-13T08:48:00.154Z13-12-2021 14:18:00 IST
Updated On 13-12-2021 14:18:57 ISTmodified_dt 2021-12-13T08:48:57.280ZUpdated On 13-12-20212021-12-13T08:48:00.154Z13-12-2021 2021-12-13T08:48:00.154Z - 2021-12-13T08:48:57.280Z - 13-12-2021

ఇఛ్ఛాపురపు జగన్నాథ రావు అనేక కథలు, కథానికలు, నవలలు, రేడియో నాటికలు రచించారు. వీరి కథనా శైలి అత్యంత సున్నితమైనది. పాత్రల సంభాషణ, సన్నివేశాలు తిరిగిన మలుపుల నుండి మనంతట మనం రచయిత అంతరంగాన్ని గ్రహించాల్సిందే. జగన్నాథ రావు మాత్రం తన సందేశాన్ని ఎలుగెత్తి చాటరు. అది ఆయన ప్రత్యేకత. రచయితతో పాటు పాఠకులు కూడా కథలో ఉన్న పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తేనే కథ పరమార్థం సంపన్నమవుతుంది. పాఠకులు నిష్క్రియాపరులుగా ఉంటే అది సాధ్యం కాదు. అయితే జగన్నాథరావు కథనం పాఠకులను నిష్క్రియాపరులుగా ఉండనీయదు. అది ఆయన విశిష్టత. మనుషుల మానసిక స్థితిపై వారికున్న లోతైన అవగాహన ఆయన రచనలలో మనకి స్పష్టంగా గోచరమౌతుంది.

జగన్నాథరావు సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిని ప్రతిభా పురస్కారం తో గౌరవించింది. ఆయన రాచకొండ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

ఇవాళ మనం చదువుకుంటున్న కథ పసిడి గులాబి లో స్త్రీ శక్తిని మరుగుపరచే తెరను నింపాదిగా తొలగించి, ఆ శక్తిని మనకొక్క సారి చూపించి మళ్ళీ ఆ తెరను చటుక్కుని వేసేసిన తీరు గమనించండి. కుటుంబ, సామాజిక వ్యవస్థలు స్త్రీని అదిమి పట్టి ఉంచడాన్ని నర్మగర్భంగా తెలియజెప్పి, స్త్రీ శక్తిని మన ముందు సాక్షాత్కరింప జేసి మళ్ళీ యథాతథ స్థితికి ఒక్క క్షణంలో తీసికెళ్ళిపోతారు, రచయిత. పురుషాహంకారాన్ని ఒక్క నిమిషం నిస్సహయంగా నిలబెట్టి, దానికి వాస్తవాన్ని చూపించి, మళ్ళీ ఏమీ జరగనట్టు, ఏమీ ఎరుగనట్టు ఆ అహంకారం అవమానం లోకి జారిపోకుండా అంచులదగ్గర

ఆపుతారు. జగన్నాథరావు కథనంలో సున్నితత్వం, subtlety కి ఇదే నిదర్శనం. పసిడి గులాబి ని వినండి. మీకే అర్ధం అవుతుంది.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin