parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Oka Vantu from New Bombay tailors by Mohammed Khadeer Babu | Pathana Kutuhalam -38

13-11-2021published_dt 2021-11-13T06:58:18.292Z13-11-2021 12:28:18 IST
Updated On 13-11-2021 15:18:23 ISTmodified_dt 2021-11-13T09:48:23.054ZUpdated On 13-11-20212021-11-13T06:58:18.292Z13-11-2021 2021-11-13T06:58:18.292Z - 2021-11-13T09:48:23.054Z - 13-11-2021

మహమ్మద్ ఖదీర్ బాబుది మన సమకాలీన కథా సాహిత్యం లో ఒక విలక్షణమైన గొంతు. విశిష్టమైన కథనా శైలి. నెల్లూరు యాసను ఎంత బాగా పాత్రలతో పలికిస్తారో, సాధారణ మధ్యతరగతి తెలుగు నుడికారాన్ని కూడా అంతే వొడుపుగా పాత్రల సంభాషణల్లో పొదగ గల నేర్పరి ఖదీర్ బాబు.

ఖదీర్ బాబు వృత్తి రీత్యా పాత్రికేయుడు. పత్రికలలో పనిచేసే అవకాశాన్ని కథా సాహిత్యం ఈతరం వారికి పరిచయం చెయ్యడానికి, వారిని కథాసాహిత్య పాఠకులుగా మలచడానికి, వారిని తెలుగు కథవేపు ఆకర్షించడానికి వినియోగించారు. పాత తరం కథా రచయితల కథలను ఈ తరం వారి దగ్గరకి చేర్చడానికి వారి కథలను పునఃకథనం చేసారు.

ఈ ప్రయత్నం ఒక యెత్తయితే, వారి రచనా వ్యాసంగం ఒక యెత్తు. ఆయన కథా రాశి పెద్దది. పోలేరమ్మబండ కతలు, న్యూ బాంబే టైలర్స్, దర్గా మిట్ట కథలు, ఫప్పూ జాన్ కథలు, బియాండ్ కాఫీ, మెట్రో కథలు వారి కథల సంకలనాలు.

ఖదీర్ బాబు పాత్రల చిత్రీకరణలో చెయ్యితిరిగిన కథకులు. ఆయన పనిగట్టుకుని ఒక పాత్రను వర్ణించి మన ముందు నిలపరు. కథనం లోనే మనకు తెలియకుండా పాత్ర మనముందు క్రమేపీ ఆవిష్కరింపబడుతుంది. పాత్ర యొక్క ఒకొక్క లక్షణం, ఒకొక్క పార్శ్వం మనకి తెలియకుండానే మన కళ్ళముందుకు వచ్చి చేరుతూ ఉంటాయి. ఇదేదో అప్రయత్నంగా జరిగేదేమీ కాదు. ప్రయత్నిస్తున్నట్టుగా కనపడకుండా కథకుడు ఖదీర్ బాబు మనల్ని పాత్రలకు పరిచయం చేస్తారు. అందుకే ఆయన సృష్టించిన పాత్రలు మనకి అపరిచితులుగా అనిపించరు. ప్రతి రోజూ మన నిత్య జీవితంలో మన మధ్య తిరుగాడే వ్యక్తులుగా ఉంటాయి ఆయన పాత్రలు.

ఖదీర్ బాబు మధురాంతకం రాజారాం స్మృతికి నివాళిగా ఏర్పాటు చేసిన కథా కోకిల పురస్కారాన్ని అందుకున్నారు.

ఇవాళ మహమ్మద్ ఖదీర్ బాబు కథ 'ఒక వంతు' చదువుకుందాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin