parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Maya Bazar from Chinna Parisramalu - Pedda Kathalu by Dr. Somaraju Suseela | Pathana Kutuhalam -37

30-10-2021published_dt 2021-10-30T10:01:57.084Z30-10-2021 15:31:57 IST
2021-10-30T10:01:57.084Z30-10-2021 2021-10-30T10:01:57.084Z - - 18-01-2022

డా. సోమరాజు సుశీల శాస్త్రవేత్త. ఆవిడ భర్తకూడా శాస్త్రవేత్త. వారిద్దరూ డాక్టరేట్లు చేసి ఏ పెద్ద కంపెనీల్లోనో ఉద్యోగస్తులుగా చేరడమో, లేదా అమెరికా వెళ్ళి డాలర్ల సంపాదనలో పడడమో చెయ్యకుండా ఇక్కడే ఉండి టెక్నోక్రాట్లుగా ఒక చిన్న పరిశ్రమను స్థాపించారు. 

ఆ పరిశ్రమ పెట్టడం, అనుమతులకోసం తంటాలు పడడం, దాన్ని నడపడం, బ్యాంకుల చుట్టూ అప్పులకోసం, ఓవర్డ్రాఫ్టులకోసం తిరగడం, ఆర్డర్లకోసం తాపత్రయపడడం, వీటన్నింటిలో ఎదురయ్యే కష్టాలను అనుభవించడం. ఇవి వారి కథల ఇతివృత్తాలు. ఈ అనుభవాలు సోమరాజు సుశీలను కధకురాలిగా తీర్చిదిద్దాయి. వారి పరిశ్రమ వారికి ఆర్ధికంగా ఎంత ఉపయోగ పడిందో మనకు తెలియదు గానీ, తెలుగు కథను మాత్రం ఖచ్చితంగా సుసంపన్నం చేసింది. 

సోమరాజు సుశీలది సహజమైన శైలి. మన ఇంట్లో వారెవరో మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఆవిడ కథనం. చాలా రచనల్లో కనిపించే కృత్రిమత్వం అస్సలు అగుపించదు వారి కథల్లో. మన ఇళ్ళల్లో రోజూ మన చెవిన పడే సున్నితమైన హాస్యం ఆవిడ రచనలకి ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. 

ఆవిడ కథల సంకలనం 'చిన్న పరిశ్రమలు-పెద్ద కథలు' కు ముళ్ళపూడి వెంకట రమణ ముందు మాట రాస్తూ ఇలా అన్నారు: "డాక్టర్ సుశీల గారి కథలు అరుదుగా వచ్చే కొత్త ఒరవడిలో నడుస్తాయి. అది ఒకే కథా వస్తువుపై చాలా కథలు చెప్పడం." 

ఇవాళ వారి ఆ సంకలనం నుంచి 'మాయాబజార్' కథను చదువుకుందాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin