24-12-2021published_dt 2021-12-24T06:00:49.283Z24-12-2021 11:30:49 IST Updated On 24-12-2021 11:38:42 ISTmodified_dt 2021-12-24T06:08:42.298ZUpdated On 24-12-20212021-12-24T06:00:49.283Z24-12-2021 2021-12-24T06:00:49.283Z - 2021-12-24T06:08:42.298Z - 24-12-2021
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-12-24T06:00:49.283Z"},{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-12-24T06:08:42.298Z"}],"comments":[],"video_status":"1","view_count":263,"status":"active","_id":"61c562114cc44728d460070d","category_id":"5bdbf63bd07281474d08ae9a","category_name":"Literature","title":"Madiga palle by Sripada Subrahmanya Sastry | Pathana Kutuhalam - 44 ","metatitle":"Madiga palle by Sripada Subrahmanya Sastry | Pathana Kutuhalam - 44 ","metadescription":"శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి వచనం అనితర సాధ్యమని శ్లాఘించబడింది. అయన అనుభవాలూ - జ్ఞాపకాలూను గ్రంధానికి ముందుమాట లో మొదటి వాక్యంలోనే ఏటుకూరి ప్రసాద్ ఇలా అన్నారు.","metakeywords":"#Reading #Poems #Telugu #SripadaSubrahmanyaSastry #PathanaKutuhalam","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p style=\"text-align: justify;\">శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి వచనం అనితర సాధ్యమని శ్లాఘించబడింది. అయన అనుభవాలూ - జ్ఞాపకాలూను గ్రంధానికి ముందుమాట లో మొదటి వాక్యంలోనే ఏటుకూరి ప్రసాద్ ఇలా అన్నారు. \"వచనానికి కండబలం, గుండెబలం ఇచ్చిన రచయితల్లో శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గణనీయులు\". ఈ మాట అక్షర సత్యం. శ్రీ పాద రాస్తున్న కాలంలో వచనాని కన్నా పద్యానికి, కవితకు ఎక్కువ మంది ప్రభావవంతమైన తెలుగు సాహిత్య కారులు పెద్ద పీట వేసారు. అయినా శ్రీపాద తన ఎంపిక వచనమే అని ఆ వైపే నిలబడి వచనానికి కొత్త బలాన్ని ఇచ్చారు. అయన వాక్యంలో తెలుగు బాషా కొత్త సొగబులు అద్దుకుంది. ఆయన కథలు ఆనాటి సమాజంలో నెలకొన్న భావ సంఘర్షణకు అద్దం పట్టాయి. వ్యవహారిక భాషోద్యమానికి అండదండలందించాయి. తెలుగు దనాన్ని విరబూయిం చాయి. మూఢాచార విచారాలకు ఎదురొడ్డి నిలిచాయి. </p>\r\n<p style=\"text-align: justify;\">శ్రీపాదను \"సాహిత్య తపస్సంపద పొందిన మహారచయితలు మీరు\" అని కొనియాడారు పురిపండా అప్పలస్వామి\". తమరీనాటి ఆంధ్ర వ్యావహారిక భాషా నిర్మాతృగణ ప్రధమ గణనీయులు అని శ్లాఘించారు విశ్వనాథ సత్యనారాయణ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ జ్ఞాపకాలూను రాసేనాటికి తెలుగులో స్వీయ చరిత్రలు చాలా తక్కువ. స్వీయ చరిత్రను కొత్త పుంతలు తొక్కించి, వారి పరిశీలననూ, వారి సమ కాలీన సమాజంలో నెలకొన్న పరిస్థితులను అందులోని గుణదోషాలను విమర్శనాత్మకంగా హృద్యమైన గద్యంలో మనకు అందించారు శ్రీపాద ఈ గ్రంధంలో. </p>\r\n<p style=\"text-align: justify;\">ఇవాళ వారి అనుభవాలూ జ్ఞాపకాలూను స్వీయ చరిత్ర గ్రంధం నుంచి కొన్ని భాగాలు చదువుకుందాం. </p>\r\n</body>\r\n</html>","tags":"#Reading #Poems #Telugu #SripadaSubrahmanyaSastry #PathanaKutuhalam","url":"/literature/madiga-palle-by-sripada-subrahmanya-sastry-|-pathana-kutuhalam---44","thumbnailratio":"16_9","english_url":"/literature/madiga-palle-by-sripada-subrahmanya-sastry","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-12-24T06:00:49.283Z","img_alt_description":"Madiga palle by Sripada Subrahmanya Sastry ","short_description":"శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి వచనం అనితర సాధ్యమని శ్లాఘించబడింది. అయన అనుభవాలూ - జ్ఞాపకాలూను గ్రంధానికి ముందుమాట లో మొదటి వాక్యంలోనే ఏటుకూరి ప్రసాద్ ఇలా అన్నారు.","embedded":"https://www.youtube.com/watch?v=zerp-E0PKxM","english_title":"Madiga palle by Sripada Subrahmanya Sastry ","thumbnail1":"/uploads/z0ZaSNpAPN.png","thumbnail2":"/uploads/dajDqtqi59.png","thumbnail3":"/uploads/RFvybBzVTi.png","__v":0,"modified_dt":"2021-12-24T06:08:42.298Z","editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/literature/madiga-palle-by-sripada-subrahmanya-sastry-|-pathana-kutuhalam---44","published_dt":"2021-12-24T06:00:49.283Z","published_dt_txt":"24-12-2021","published_dt_time_txt":"24-12-2021 11:30:49 IST","updated_dt_time_txt":"24-12-2021 11:38:42 IST"}
శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి వచనం అనితర సాధ్యమని శ్లాఘించబడింది. అయన అనుభవాలూ - జ్ఞాపకాలూను గ్రంధానికి ముందుమాట లో మొదటి వాక్యంలోనే ఏటుకూరి ప్రసాద్ ఇలా అన్నారు. "వచనానికి కండబలం, గుండెబలం ఇచ్చిన రచయితల్లో శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గణనీయులు". ఈ మాట అక్షర సత్యం. శ్రీ పాద రాస్తున్న కాలంలో వచనాని కన్నా పద్యానికి, కవితకు ఎక్కువ మంది ప్రభావవంతమైన తెలుగు సాహిత్య కారులు పెద్ద పీట వేసారు. అయినా శ్రీపాద తన ఎంపిక వచనమే అని ఆ వైపే నిలబడి వచనానికి కొత్త బలాన్ని ఇచ్చారు. అయన వాక్యంలో తెలుగు బాషా కొత్త సొగబులు అద్దుకుంది. ఆయన కథలు ఆనాటి సమాజంలో నెలకొన్న భావ సంఘర్షణకు అద్దం పట్టాయి. వ్యవహారిక భాషోద్యమానికి అండదండలందించాయి. తెలుగు దనాన్ని విరబూయిం చాయి. మూఢాచార విచారాలకు ఎదురొడ్డి నిలిచాయి.
శ్రీపాదను "సాహిత్య తపస్సంపద పొందిన మహారచయితలు మీరు" అని కొనియాడారు పురిపండా అప్పలస్వామి". తమరీనాటి ఆంధ్ర వ్యావహారిక భాషా నిర్మాతృగణ ప్రధమ గణనీయులు అని శ్లాఘించారు విశ్వనాథ సత్యనారాయణ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ జ్ఞాపకాలూను రాసేనాటికి తెలుగులో స్వీయ చరిత్రలు చాలా తక్కువ. స్వీయ చరిత్రను కొత్త పుంతలు తొక్కించి, వారి పరిశీలననూ, వారి సమ కాలీన సమాజంలో నెలకొన్న పరిస్థితులను అందులోని గుణదోషాలను విమర్శనాత్మకంగా హృద్యమైన గద్యంలో మనకు అందించారు శ్రీపాద ఈ గ్రంధంలో.
ఇవాళ వారి అనుభవాలూ జ్ఞాపకాలూను స్వీయ చరిత్ర గ్రంధం నుంచి కొన్ని భాగాలు చదువుకుందాం.