parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Doragaru - Diwanji by Viswanatha Satyanarayana | Pathana Kutuhalam - 47

21-01-2022published_dt 2022-01-21T06:24:42.892Z21-01-2022 11:54:42 IST
2022-01-21T06:24:42.892Z21-01-2022 2022-01-21T06:24:42.892Z - - 04-10-2022

విశ్వనాథ సత్యనారాయణ గురించి పరిచయ వాక్యాలు చెప్పడం సాహసమే అవుతుంది.  తెలుగు అక్షరజ్ఞానం ఉన్నవారిలో విశ్వనాథ తెలియన వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన అసమాన ప్రతిభాశాలి. ఆధునిక యుగంలో సాంప్రదాయానికి, ముఖ్యంగా ఛందోబద్ధ పద్యానికి పెద్ద దిక్కు. విశ్వనాథ గురించి ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం చెప్పిన మాటలు ఆ మహాకవి ప్రతిభ ఎటువంటిదో మనకు తెలియజేస్తాయి. ""ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా అతను చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో అతనుదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో వాక్యంలో, శబ్దంలో సమాసంలో భావంలో, భావనలో దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది."

వచన కవిత్వం తప్ప ఆయన స్పృశించని రచనా ప్రక్రియ లేదు. కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పాటలు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు అన్నీ పుంఖానుపుంఖాలుగా ఆయన కలం నుండి జాలువారాయి. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు. ఆయన రాసినవన్నీ కలిపితే సుమారు ఒక లక్ష పేజీలుంటాయని ఒక అంచనా. జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు కవి, రచయిత ఆయన. కవిసమ్రాట్ బిరుదాంకితులు. 

1916 లో విశ్వేశ్వర శతకం తో విశ్వనాథ రచనా ప్రస్థానం ప్రారంభమయ్యింది. వారి రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి - ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి, మొదలైనవి. వేయిపడగలు నవలను పీవీ నరసింహారావు హిందీలోకి అనువదించారు. వారి ఏకవీర, తమిళ మళయాళ భాషల్లోకి అనువదింపబడింది.

ఇవాళ మనం చదువుకునే కథ విశ్వనాథలో ఉన్న మరో పార్శ్వాన్ని ఆవిష్కరిస్తుంది. అందరూ అనుకున్నట్టు,అపోహ పడినట్టు ఆయన గతంలో కూరుకు పోయిన ఛాందసుడు కాదు. ఆకలి, పేదరికము, అన్యాయము, సామాజిక స్పృహ ఆయనకు అపరిచితాలు కావు. పైగా ఆయన రచనలకి ఇతివృత్తాలు కూడా. అయితే ఆధునిక తెలుగు సాహిత్యంలో వెర్రితలలు వేస్తున్న నాస్తిక  వాదాన్ని, పాశ్చాత్య పోకడలను ఎదిరించి తెలుగుజాతి గత వైభవాన్ని, భారతీయ సంప్రదాయాన్ని పునః ప్రతిష్ఠించడానికి ఆయన కంకణబద్ధులయ్యారు. 

ఇవాళ ఆయన చిన్న కథ దొరగారు - దివాన్ జీ చదువుకుందాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin