parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.Can't We Do This For Telugu?

17-12-2018published_dt 2018-12-17T12:04:59.141Z17-12-2018 17:34:59 IST
Updated On 17-12-2018 18:22:54 ISTmodified_dt 2018-12-17T12:52:54.027ZUpdated On 17-12-20182018-12-17T12:04:59.141Z17-12-2018 2018-12-17T12:04:59.141Z - 2018-12-17T12:52:54.027Z - 17-12-2018

 

 

 

నిజం మాట్లాడుకోవాలంటే పిల్లల గురించి ఆలోచించేవాళ్ళే తక్కువ ఈ రోజుల్లో. వాళ్ళ గురించి రాసేవాళ్ళు ఇంకా తక్కువ. సరళమ్మగారు పిల్లలగురించి తపిస్తారుఆలోచిస్తారువారికోసం రాస్తారు. అందుకే వారు చాలా విశిష్టమైన వ్యక్తి. 

 

మన దేశం లో పిల్లలకోసం జరిగే సాహిత్య సృష్టి తక్కువ. తెలుగులో మరీ తక్కువ. దీనికి ముఖ్య కారణం పిల్లల పఠనావసరాల మీద పెద్దవాళ్ళకు శ్రద్ధ తక్కువ కావడమైతేమరో ప్రధానమైన కారణం పిల్లల కోసం రాయగలిగే నేర్పరితనం కొరవడడం. సరళమ్మగారికి పిల్లల పఠనావసరాలమీద అమితమైన శ్రద్ధ ఉంది. వారిని ఆకట్టుకునేలా రాసే సామర్ధ్యం ఉంది. అది వారిలో ప్రత్యేకత. 

 

మన పిల్లలు తెలుగు మర్చిపోకుండా చూడాలన్న వారి తాపత్రయం ఈ పుస్తకంలోని ప్రతి పంక్తిలోనూ కనపడుతుంది. దానితోపాటు పిల్లలు చరిత్రసామాజిక శాస్త్రాలు చదవుకోవాలన్న సరళమ్మగారి ఆకాంక్ష కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రెండు లక్ష్యాలూ ముందుంచుకుని ఈ పుస్తక ముద్రణ జరిగిందని అనుకుంటేఅవి నూటికినూరు శాతం నెరవేరాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

మన సమాజంలో ఒక అభిప్రాయం ఉంది. ఇంగ్లీషు రాకపోతే మన పిల్లలు ఎందుకూ పనికిరాకుండా పోతారని. తెలుగులో చదువుకుంటే ప్రపంచంలో వస్తున్న నూతన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు వారికి అందుబాటులోకి రావు. ఇది ప్రస్తుతం నిజమే. 

 

కానీ దీనికి కారణం మనమే. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల తెలుగు సేతను మనం ఎందుకు చేసుకోవడం లేదుతక్కిన సమాజాలు అలాకాదే. జపాన్స్పెయిన్జర్మనీరష్యాచైనాఇజ్రాయేల్ మొదలైన దేశాలలోనివారు ఆధునిక విజ్ఞాన సముపార్జనకు ఇంగ్లీషు మీద ఆధారపడడం లేదు. ఏ భాషలో వచ్చినదాన్నయినా చిటికెలో వాళ్ళ భాషల్లోకి అనువాదం చేసేసుకుని పాఠాలు చెప్పేసుకుంటారు. అది మనం చేసుకోవడం లేదు. అందుచేత మనకి ఇంగ్లీషు తప్ప గత్యంతరం లేదనుకుంటున్నాం. ఇది మారాలి.

 

నాకొక పేరాశ ఉంది. ఇప్పుడు తెలుగు చదువుకుంటే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు అనుకునే స్థితి నుంచి తొందరలోనే తెలుగులో చదువుకుంటే మన పిల్లలకి ఏ ఇబ్బందీ ఉండదు అనుకునే పరిస్థితి రావాలి. అక్కణ్ణించి,మన పిల్లలు తెలుగు చదువుకోపోతే వారికి భవిష్యతు ఉండదు అనే స్థితి రావాలి. ఉలిక్కి పడవద్దు. ముందే చెప్పానుగాపేరాశ అని.

 

దానికి చాలా పరిశ్రమ జరగాలి. ప్రపంచంలో ఎక్కడ ఏ భాషలో ఏ పనికొచ్చేది వచ్చినా చిటుక్కున తెలుగులో మనపిల్లలకు అందుబాటులోకి తెచ్చెయ్యాలి. సంవత్సరానికి ఒకసారయినా మన నిఘంటువులను సవరించుకోవాలికొత్త మాటల్ని చేర్ఛుకోవాలి. కొత్త పదాలను పుట్టించుకోవాలి. పదసంపదను నిత్యనూతనంగా ఉంచుకోవాలి.  అప్పుడే తెలుగు తప్ప ఇక ఏ భాషా రాకపోయినా మనపిల్లలు ఏమీ కోల్పోరు. ప్రపంచంలో ఎవరికీ తీసిపోరు. వారి ఎదుగుదలకు భాష ప్రతిబంధకం కాదు.  

  

తెలుగు చదువుకోవడంతెలుగులో చదువుచెప్పడం విషయంలో కూడా మనం పెద్ద తప్పులు చేస్తున్నాం. మన భాషా సమస్యకు మూలం బహుశః అక్కడే ఉంది. తెలుగును విషయాలను వ్యక్తీకరించే సరళ సాధనంగా కాకుండాసాహిత్య పాండిత్య గరిమను ప్రదర్శించేందుకా అన్నట్టు చూస్తున్నాం. నన్నయతిక్కనపోతనశ్రీనాధుల ఊసు లేకుండా తెలుగును బోధించడంలేదు. సరళమైన విషయగ్రహణకు అనువైన తెలుగును బోధించి పిల్లల్ని వదిలితే ముందు తెలుగు నేర్చుకుంటారు. ఆ పై సాహితీ రుచి కలిగినవారు గ్రంధాలుప్రభంధాలూ చదువుకుంటారు. లేనివాళ్ళు నిత్యకృత్యాలకి వాడుకుంటారు. ఈవాళ ప్రపంచంలో భాషా బోధన చాలా కొత్త పుంతలు తొక్కింది. తెలుగు భాషా బోధన మాత్రం ఇంకా చిన్నయ సూరి గారి దగ్గరే ఆగిపోయింది. కనీసం గిడుగు వారి దగ్గరకు కూడా చేరలేదు. అందుచేతనే తెలుగు భాషగానే మిగులుతోంది తప్ప విషయపరిజ్ఞాన గ్రహణకు సాధనంగా మారడంలేదు. ఇది తక్షణం దిద్దుకోవాలి. 

 

 

సరళమ్మ గారి పుస్తకంలోవారి వ్యాసాలలో తెలుగును విషయ బోధనకు సాధనంగా మలిచే ప్రయత్నం కనిపించింది. ఇటువంటి ప్రయత్నాలు మన సమాజానికిమన మాతృ భాషకి ఈవాళ చాలా అవసరం. రంగస్థలం మీద నిలబడి సీసపద్యాలను రాగం తీస్తూ ఆలపించడానికిప్రవచనాలు చెప్పడానికీ  పరిమితం చేస్తే తెలుగు బతకదు. మన న్యాయస్థానాలలో వాదనలు వినిపించడానికితీర్పులు వెలువరించడానికీప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడానికీఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికీబాంకు పరీక్షలు రాయడానికీఇన్సూరెన్సు ఫారాలు నింపడానికివ్యాపారాలు చేసుకోవడానికీ పనికొచ్చేలా చేస్తే తెలుగు అజరామరంగా వర్ధిల్లుతుంది.

 

నిజ జీవితంలోనిత్యజీవితంలో పనికిరానిదానిని పిల్లలు ఆదరించరు. మన భాషను పురావస్తు ప్రదర్శనశాలల్లొ కాకుండా ఆధునికి ప్రయోగశాలల్లో వాడుకలో పెట్టాలి. సామాజిక ఆర్ధిక శాస్త్ర విషయాధ్యయనానికిబోధనకు వినియోగించాలి. 

 

సరళమ్మ గారి ఈ పుస్తకం ఈ కోవలోదని నా కనిపించింది. ఈ ప్రయత్నం చేసినందుకు వారికి నా అభివందనాలు. వారు రాసిన వ్యాసాలను ఇలా పుస్తక రూపంలో తెచ్చినందుకు వారి కుటుంబసభ్యులకు నా అభినందనలు.          

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin