parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Andhraratna GopalaKrishnuni Chatuvulu | Pathana Kutuhalam -42

13-12-2021published_dt 2021-12-13T09:01:16.253Z13-12-2021 14:31:16 IST
Updated On 13-12-2021 14:38:41 ISTmodified_dt 2021-12-13T09:08:41.259ZUpdated On 13-12-20212021-12-13T09:01:16.253Z13-12-2021 2021-12-13T09:01:16.253Z - 2021-12-13T09:08:41.259Z - 13-12-2021

ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు విన గానే మనకు గుర్తుకొచ్చేవి చీరాల-పేరాల సత్యాగ్రహము, రామదండు. నాలుగు పదుల వయసును చేరుకోకుండానే అతిచిన్నవయసులోనే మరణించినా, దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో జరిగిన ఒక మహోజ్వల ఘట్టానికి నాయకత్వం వహించి ఆంధ్ర రత్న గా శాశ్వత కీర్తిని ఆర్జించిన మహామనీషి దుగ్గిరాల.

ఆయన బహుభాషా కోవిదుడు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, హిందీ భాషలలో నిష్ణాతుడు. ఎడింబర విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్రం అభ్యసించారు. భారతదేశానికి తిరిగివచ్చాక రాజమండ్రి ప్రభుత్వ కాలేజీ లోను, బందరు జాతీయ కళాశాల లోను అధ్యాపక వృత్తి నిర్వహించారు. 1920 లో కలకత్తా లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరై సహాయ నిరాకరణ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు.

దుగ్గిరాల సాహితీవేత్త, గొప్ప వక్త, అనువాదకుడు, గాయకుడు. పిన్న వయసులోనే నందికేశ్వర విరచిత అభినయ దర్పణము అనే సంస్కృత గ్రంధాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. 1917 లో దానిని కేంబ్రిడ్జ్ - హార్వార్డ్ యూనివర్శిటీ ప్రెస్ వారు ప్రచురించారు. అప్పటికి గోపాలకృష్ణయ్య వయసు 28 సంవత్సరాలే. ఆయన సభలలో ప్రసంగించేటప్పుడు పద్యగానం చేస్తే సభికులు ఉత్తేజితులై ప్రేరణ పొందేవారు.

దుగ్గిరాల మంచి చమత్కారి. నిర్మొహమాటంగా మాట్లాడేవాడు. ఆయన తన సమకాలికులైన అనేకమంది నాయకులను గురించి, సంఘటనల గురించి, ఊళ్ళగురించి చాలా చాటుపద్యాలను చెప్పారు. వాటిలో ఆయన హాస్యం, చమత్కారం, వేళాకోళ ధోరణి, విమర్శ మనకి స్ఫుటంగా కనపడతాయి. ఆయన లౌకిక పారమార్ధిక దృష్టికోణాలు వాటిలో నిగూఢంగా ఆవిష్కృతమౌతాయి. ఆయన ఎవ్వరినీ ఉపేక్షించలేదు. చివరికి తనను గురించి కూడా హాస్యంగా, విమర్శనాత్మకంగా ఆశువుగా పద్యాలను చెప్పారాయన.

ఇవాళ ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వివిధ సందర్భాలలో, సభలలో చెప్పిన కొన్నిచాటు పద్యాలను చదువుకుందాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin