29-08-2019published_dt 2019-08-29T13:01:21.013Z29-08-2019 18:31:21 IST Updated On 29-08-2019 18:34:29 ISTmodified_dt 2019-08-29T13:04:29.087ZUpdated On 29-08-20192019-08-29T13:01:21.013Z29-08-2019 2019-08-29T13:01:21.013Z - 2019-08-29T13:04:29.087Z - 29-08-2019
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2019-08-29T13:01:20.888Z"},{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2019-08-29T13:04:29.087Z"}],"comments":[],"video_status":"0","view_count":2031,"status":"active","_id":"5d67cca19673c706ae8b39e6","category_id":"5bdbf63bd07281474d08ae9a","category_name":"Literature","title":"అమ్మనోట ... అమ్మనుడి ","metatitle":"Amma's Telugu Language Expressions","metadescription":"Amma's Telugu usages are very expressive","metakeywords":"Amma, Telugu Language, Idioms, Expressions, Literature","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif; text-align: center;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\"><img src=\"../uploads/7GoDKw6nn5_medium.png\" alt=\"Amma\" width=\"225\" height=\"300\" /></span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"> </p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"> </p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అమ్మకు ఇప్పుడు ఎనభై ఎనిమిది ఏళ్ళు నిండాయి. మొన్న ఏప్రిల్ లో ఎనభై తొమ్మిదిలోకి అడుగుపెట్టింది. నిన్న మొన్నటి విషయాలు పెద్దగా గుర్తుండకపోవచ్చు గాని</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">పాతవిషయాలు మాత్రం కళ్ళకుకట్టినట్లు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">పూసగుచ్చినట్లు చెప్తుంది.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-GB\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అమ్మ మాట్లాడితే తెలుగు సామెతలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">నుడికారాలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">పలుకుబడులు ప్రవాహంలాగ వచ్చేస్తాయి. మన భాష ఇంత లోతైనదా</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">?, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">జనజీవన అనుభవాలను</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">,</span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అనుభూతులను</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">పరిశీలనలను ఇంతగా తనలో ఇముడ్చుకుందా</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">?</span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అని ఆశ్చర్యం కలుగుతుంది. గర్వంగా ఉంటుంది. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">కాని</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అలాంటి పలుకుబడులు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">సామెతలు ఈమధ్యకాలంలో మన చెవిన పడడంలేదే అని బాధ కూడా కలుగుతుంది. ఈ భాషాగరిమనీ</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">,</span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">పదసంపదనీ</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">సుందర వ్యక్తీకరణనీ మనం కోల్పోతున్నామా అనే ఆందోళన కలుగుతుంది. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అమ్మ మాటల్లో దొర్లే సామెతలను నేను ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటాను. అవన్నీ కలిపి మరెప్పుడైనా అందిస్తాను. వాటిని ఆవిడ వాడిన సందర్భాలను కూడా వివరిస్తాను. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఇవాళ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ మధ్య అమ్మ నోటి నుంచి వచ్చిన రెండు పలుకుబడులను ఇక్కడ చెపుతాను.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మొన్న మాకు బాగా తెలిసిన వారు అమ్మను చూడడానికి వచ్చారు. క్రితంసారి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒకావిడ బాగా చిక్కిపోయి ఉంది. ఈసారి కొంతకోలుకుంది. వారి పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి కాబోలు. వాళ్ళు వెళ్ళాక అమ్మ నాతో అంది: చూసావా</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఆవిడ ఇప్పుడు చూడ్డానికి కాస్త బాగుంది. కొంచెం వొళ్ళొచ్చింది</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">రంగొచ్చింది. ఎంతైనా</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">,</span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మేపే రూపు.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మేపే రూపు.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మేపే రూపట! </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">శరీరానికి పోషణ ఉంటే రూపం బాగుంటుందని. మేపు అంటే తిండి. పోషణ. మేపడం అంటాం. మెయ్యడం</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మేత అంటాం.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మేపే రూపు. రెండే మాటలు. ఈ చిన్ని పలుకుబడిలో లయ ఉంది. లోతైన అర్ధం ఉంది. శరీర ధర్మం ఉంది</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఆరోగ్య సూత్రం ఉంది. జీవిత సత్యం ఉంది.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వాళ్ళతో వచ్చిన ఒక పిల్లవాడు వాడి ప్లేట్లో నాలుగు బిస్కెట్లున్నా ఇంకా కావాలి</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఇంకా కావాలి అని మారాం చేసాడు. వాడు ఆ నాలుగే తినలేని పసివాడు. అమ్మ వాడి గురించి నాతో అంది: వాడికి కడుపు నిండినా కళ్ళు నిండవు అని. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">కడుపు నిండినా కళ్ళు నిండవట! </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఎంత గొప్ప వ్యక్తీకరణో. మన అందరి అనుభవమే కదా ఇది. మనం తినగలిగినదానికన్న</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వాడగలిగినదానికన్నా</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అవసరమైన దానికన్నా ఎక్కువ మనదగ్గర ఉండాలని కోరుకుంటాం. ఎక్కువ చూసుకోవాలనుకుంటాం. ఎక్కువ మన స్వాధీనంలో ఉండాలనుకుంటాం. అవి మన కడుపుకు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అవసరానికీ సరిపోయినా</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మన మనసుకు సరిపోవు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">తృప్తినివ్వవు. మన దృష్టికి సరిపోవు. మన ఆబకు సరిపోవు. సూటిగా చెప్పాలంటే మన కళ్ళకు సరిపోవు. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మన కడుపులు నిండినా మన కళ్ళు నిండవు. </span></p>\r\n</body>\r\n</html>","tags":"Amma, Parakala, Telugu, Telugu Language","url":"/literature/అమ్మనోట-అమ్మనుడి","thumbnailratio":"16_9","english_url":"/literature/ammas-telugu-expressions","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2019-08-29T13:01:21.013Z","img_alt_description":"","short_description":"Many expressions Amma uses are not anymore to be heard in the contemporary telugu speech. They are a treasure. They should be noted and preserved.","embedded":"","english_title":"Amma's Telugu Expressions","thumbnail1":"/uploads/A4kCBsFfrt.png","thumbnail2":"/uploads/yJNq3SHETr.png","thumbnail3":"/uploads/oE4SWHAvNC.png","__v":0,"modified_dt":"2019-08-29T13:04:29.087Z","editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/literature/అమ్మనోట-అమ్మనుడి","published_dt":"2019-08-29T13:01:21.013Z","published_dt_txt":"29-08-2019","published_dt_time_txt":"29-08-2019 18:31:21 IST","updated_dt_time_txt":"29-08-2019 18:34:29 IST"}
అమ్మకు ఇప్పుడు ఎనభై ఎనిమిది ఏళ్ళు నిండాయి. మొన్న ఏప్రిల్ లో ఎనభై తొమ్మిదిలోకి అడుగుపెట్టింది. నిన్న మొన్నటి విషయాలు పెద్దగా గుర్తుండకపోవచ్చు గాని, పాతవిషయాలు మాత్రం కళ్ళకుకట్టినట్లు, పూసగుచ్చినట్లు చెప్తుంది.అమ్మ మాట్లాడితే తెలుగు సామెతలు, నుడికారాలు, పలుకుబడులు ప్రవాహంలాగ వచ్చేస్తాయి. మన భాష ఇంత లోతైనదా?, జనజీవన అనుభవాలను,అనుభూతులను, పరిశీలనలను ఇంతగా తనలో ఇముడ్చుకుందా?అని ఆశ్చర్యం కలుగుతుంది. గర్వంగా ఉంటుంది. కాని, అలాంటి పలుకుబడులు, సామెతలు ఈమధ్యకాలంలో మన చెవిన పడడంలేదే అని బాధ కూడా కలుగుతుంది. ఈ భాషాగరిమనీ,పదసంపదనీ, సుందర వ్యక్తీకరణనీ మనం కోల్పోతున్నామా అనే ఆందోళన కలుగుతుంది. అమ్మ మాటల్లో దొర్లే సామెతలను నేను ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటాను. అవన్నీ కలిపి మరెప్పుడైనా అందిస్తాను. వాటిని ఆవిడ వాడిన సందర్భాలను కూడా వివరిస్తాను. ఇవాళ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ మధ్య అమ్మ నోటి నుంచి వచ్చిన రెండు పలుకుబడులను ఇక్కడ చెపుతాను.మొన్న మాకు బాగా తెలిసిన వారు అమ్మను చూడడానికి వచ్చారు. క్రితంసారి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒకావిడ బాగా చిక్కిపోయి ఉంది. ఈసారి కొంతకోలుకుంది. వారి పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి కాబోలు. వాళ్ళు వెళ్ళాక అమ్మ నాతో అంది: చూసావా, ఆవిడ ఇప్పుడు చూడ్డానికి కాస్త బాగుంది. కొంచెం వొళ్ళొచ్చింది, రంగొచ్చింది. ఎంతైనా,మేపే రూపు.మేపే రూపు.మేపే రూపట! శరీరానికి పోషణ ఉంటే రూపం బాగుంటుందని. మేపు అంటే తిండి. పోషణ. మేపడం అంటాం. మెయ్యడం, మేత అంటాం.మేపే రూపు. రెండే మాటలు. ఈ చిన్ని పలుకుబడిలో లయ ఉంది. లోతైన అర్ధం ఉంది. శరీర ధర్మం ఉంది, ఆరోగ్య సూత్రం ఉంది. జీవిత సత్యం ఉంది.వాళ్ళతో వచ్చిన ఒక పిల్లవాడు వాడి ప్లేట్లో నాలుగు బిస్కెట్లున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని మారాం చేసాడు. వాడు ఆ నాలుగే తినలేని పసివాడు. అమ్మ వాడి గురించి నాతో అంది: వాడికి కడుపు నిండినా కళ్ళు నిండవు అని. కడుపు నిండినా కళ్ళు నిండవట! ఎంత గొప్ప వ్యక్తీకరణో. మన అందరి అనుభవమే కదా ఇది. మనం తినగలిగినదానికన్న, వాడగలిగినదానికన్నా, అవసరమైన దానికన్నా ఎక్కువ మనదగ్గర ఉండాలని కోరుకుంటాం. ఎక్కువ చూసుకోవాలనుకుంటాం. ఎక్కువ మన స్వాధీనంలో ఉండాలనుకుంటాం. అవి మన కడుపుకు, అవసరానికీ సరిపోయినా, మన మనసుకు సరిపోవు, తృప్తినివ్వవు. మన దృష్టికి సరిపోవు. మన ఆబకు సరిపోవు. సూటిగా చెప్పాలంటే మన కళ్ళకు సరిపోవు. మన కడుపులు నిండినా మన కళ్ళు నిండవు.