16-11-2018published_dt 2018-11-16T07:54:53.389Z16-11-2018 13:24:53 IST
Updated On 16-11-2018 13:24:53 ISTmodified_dt 2018-11-16T07:54:53.391ZUpdated On 16-11-20182018-11-16T07:54:53.389Z16-11-2018 2018-11-16T07:54:53.389Z - 2018-11-16T07:54:53.391Z - 16-11-2018
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2018-11-16T07:54:53.389Z"}],"comments":[],"video_status":"0","view_count":2752,"status":"active","_id":"5bee77cd12efda61a252adc9","category_id":"5bdbf636d07281474d08ae99","category_name":"Life In General","title":"మా ఇంట్లో దీపావళి","metatitle":"Amma and Deepavali at Home","metadescription":"This s about how we celebrated Deepavali at home in Narasapuram in our childhood","metakeywords":"Deepavali, Diwali, Amma, Childhood, Narasapuram, Festival","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p> </p>\r\n<p> </p>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">నాన్నగారికి దీపావళి చాలా ప్రియమైన పండుగ. అమ్మకి కూడా ఈ పండుగ అంటే అమితమైన ఇష్టం. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">అసలు మా ఇంట్లో దీపావళే పెద్ద పండుగ. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">సుమారు నెల్లాళ్ళ ముందునుంచీ ఇంట్లో హడావిడి మొదలయ్యేది. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">కనీసం ఇరవై రోజుల ముందైనా కొత్త బట్టలు టైలర్ కి ఇచ్చెయ్యాలి. లేకపోతే పండక్కి కుట్టలేడట! పండగ ముందు గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది. వాడు కూడా ముందు బట్ట నానపెట్టాలి. నాన బెట్టాక కొంత లాగేసి కురచగా అయిపోతుంది బట్ట. నానబెట్టకుండా కుట్టేస్తే కొత్తగా తొడుక్కున్నప్పుడు బానే ఉంటాయి. ఒక రేవు వేస్తే కురచగా, బిగువుగా అయిపోతాయి. అమ్మ అలా అస్సలు ఒప్పుకునేది కాదు; ఎదిగే పిల్లలకి ఓ రెండంగుళాలు పొడవుగానే ఉండాలనేది ఆవిడ సిద్ధాంతం. ఒక్క రేవు వేస్తే పొట్టైపోతే ఆవిడ ఊరుకుంటుందా!? </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">ఎన్ని పనులున్నా, దేశంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా దీపావళికి ఒకటి రెండు రోజుల ముందే నాన్నగారు ఇంటికి చేరుకునేవారు. మందుగుండు సామానులు కొనిపెట్టడానికి </span><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">మమ్మల్ని ఆయనే </span><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">స్వయంగా బజారు తీసుకెళ్ళేవారు. మేము ఏమిఅడిగితే అది, ఎంత ఖర్చవుతుందో లెఖ్ఖ చెయ్యకుండా కొనిపెట్టేవారు. మాకు కావలసినవన్నీ కావలసినన్ని కొనేసుకునేవాళ్ళం. బుట్టలు బుట్టలు దీపావళి మందుగుండు సామానులు ఇంటికి తీసుకొస్తే ఖర్చు గురించి ఆలోచించి పాపం అమ్మ కొంచెం తల్లడిల్లేది. అయినా ఏమనేది కాదు.</span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">కొన్ని సామానులు ఇంటిలోనే, మేమే, తయారు చేసుకునేవాళ్ళం. చిచ్చుబుడ్లు, మతాబులు, తారాజువ్వలు, తాటాకు టపాకాయలు, సిసింద్రీలు చేసుకునేవాళ్ళం. అవి తయారుచేసుకోడానికి కావలసిన సూరేకారం, మతాబు మందు లాంటివి శారదా హాల్ దగ్గర ఓ పక్కసందులో దొరికేవి. అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. బావ బాగా శ్రద్ధ పెట్టేవాడు ఇవి తయారు చెయ్యడానికి. అవి బాగా కాలడానికీ, పేలడానికీ, ఎగరడానికీ మందుల పాళ్ళు కలపడంలో ఉంటుంది కిటుకు. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">పదిహేను ఇరవై రోజులముందు నుంచి ఇంటిలో హడావిడి మొదలయ్యేది. </span><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">ఇంటిలో ఉన్న పాత పేపర్లు గెడంచా లోంచి తియ్యాలి. వాటిని సరిపడగా కత్తిరించాలి, మతాబు సైజును బట్టి. సిసింద్రీలకు చిన్న సైజులో కట్ చెయ్యాలి. తాటాకు టపాకాయలు చెయ్యడానికి మంచి నాణ్యమైన తాటాకులు తేవాలి. వీటికి కావలసిన మందును సరైన పాళ్ళలో కలిపాలి. కుప్పలుగా పోసి పెట్టుకోవాలి. ఇక అలా పోసిపెట్టుకున్న మందుని గట్టిగా మతాబు గొట్టాల్లోకీ, సిసింద్రీల్లోకీ, జువ్వల్లోకీ దట్టించాలి. వదులుగా దట్టిస్తే బాగా కాలవు. అలా అని మరీ గట్టిగా దట్టిస్తే కూడా కుదరదు. అసలు సరిగా అంటుకోనే అంటుకోవు. సమంగా ఉండాలి దట్టింపు.</span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">మా మందుగుండు సామాను తయారీ ఇలా ఉంటే, ఇక ఇంట్లో ప్రమిదలకు వత్తులు చేసే పని తక్కువేమీ కాదు. పెద్దవాళ్ళు దూదిని తొడమీద పెట్టుకుని అరచేత్తొ నలుపుతూ వత్తుల్లాగ చుట్టేవాళ్ళు. నిరుటి సంవత్సరం ప్రమిదలు ఎన్ని ఉన్నాయో చూసుకుని ఇప్పుడు ఇంకా ఎన్ని కావాలో ఉజ్జాయింపు వేసుకుని అమ్మ కొత్త ప్రమిదలు తెప్పించేది. ఓ రోజు ముందు తెప్పిస్తే కాదు. కనీసం పది రోజులముందు తెప్పించుకుని, వాటిని రోజూ నీళ్ళల్లో నానబెట్టాలి. ఆ మట్టి ప్రమిదలు నీళ్ళల్లో నానకపోతే నూనె పీల్చేస్తాయట. ప్రమిదలు అంతంత నూనె అలా పీల్చేస్తే ఎవడు తిన్నట్టూ? అమ్మ ఊరుకుంటుందా? అందుకే ప్రమిదల్ని వారం రోజుల ముందే తెప్పించి, ఒక పీపా నిండా నీరు పట్టించి, దాంట్లో వాటిని నానపెట్టించేది.</span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"> </div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em; text-align: center;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\"><iframe src=\"//www.youtube.com/embed/bkYANNt2iaM\" width=\"560\" height=\"315\" frameborder=\"0\" allowfullscreen=\"allowfullscreen\"></iframe></span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"> </div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">మేము ఇంట్లో చేసుకునే మందులన్నీ పండక్కి ఓ వారం ముందే తయారైపోవాలి. ఎందుకంటే అవన్నీ బాగా ఎర్రటి ఎండలో ఎండాలి. లేకపోతే అవేవీ సరిగా కాలవు, పేలవు అనేవాళ్ళు. బజార్లో కొన్నవి కూడా మరీ వారం పది రోజులు కాకపోయినా ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టే వాళ్ళం. రోజూ ఎండ రాగానే ఈ సామానంతా పట్టుకుని డాబా మీదికి వెళ్ళడం. అన్నీ జాగ్రత్తగా బరకం మీద పరవడం. మళ్ళీ సాయంకాలం ఎండ తగ్గుముఖం పట్టేక అన్నీ జాగ్రత్తగా కిందికి తెచ్చుకోవడం. ఇదో పెద్ద కార్యక్రమం. చాలా శ్రద్దగా చేసేవాళ్ళం. అప్పుడప్పుడూ మధ్య మధ్యలో వెళ్ళి ఎలా ఎండుతున్నాయో చూసుకునేవాళ్ళం. సిగరెట్లు కాల్చేవాళ్ళు మేడమీదికి వెళ్ళకుండా జాగ్రత్తపడ్డం మరో ఎత్తు. కాస్తంత మబ్బుగా అనిపిస్తే మరీ జాగ్రత్తగా ఉండాలి. తడిసేయా, అవి మరింకెందుకూ పనికి రావు కదా! </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">ఇంతిలా ఇన్నిరోజులు ప్రయాస పడ్డాక చివరికి పండగ రోజు రానే వచ్చేది. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">పొద్దున్నే లేచిపోవాలి. పొద్దున్నే లేవాల్సివచ్చినపుడే కదా ఇంకా కాసేపు పడుకోవాలనిపించేది. ఇక నలుగు పెట్టుకుని తలస్నానం. కుంకుడుకాయ రసం కళ్ళల్లో పడకుండా నేనెప్పుడూ తలస్నానం చెయ్యలేదు. ఒక కన్ను ఎరుపెక్కి ఉండేది. మండేది. రెండు ఉప్పు కణికలు నోట్లో వేసుకుంటే మంట తగ్గేది. అదో గమ్మత్తు! దీని వెనకాల ఉన్న శాస్త్రం ఏమిటో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">కొత్త చొక్కా చివళ్ళకీ నిక్కరు చివళ్ళకీ పసుపు అంటించికానీ అమ్మ కొత్తబట్టలు తొడిగేది కాదు. నాకూ మా చిన్నాడికీ ఒకే రకం బట్టలు. బట్టలు కూడ టైలర్ చివరి ఘడియ వరకూ ఇచ్చేవాడు కాదు. రేపు రా, మాపు రా అని తిప్పుకునేవాడు. అందర్నీ అలాగే తిప్పుకునేవాడట. మరి ఎవరికి తిప్పుకోకుండా ఇచ్చేవాడో తెలియదు. మాకు టైమ్ కి బట్టలు అమర్చాడు టైలర్ అన్నవాళ్ళు నాకు ఒక్కళ్ళూ కనపడలేదు. మేము చూసి చూసి నిద్రపోయాక రేపు పండుగ అనగా రాత్రి పొద్దుపోయాక వచ్చేవి మా కొత్త బటలు. సరే పోనీ ఆ వచ్చిన కొత్తబట్టలు వేసేసుకుని ఆడుకోడానికి పరిగెడదామా అంటే కుదరదు. ఇంట్లో చేసే పిండివంటలు చుట్టుపక్కల వారికీ, ఇరుగు పొరుగువారికీ పంపకాలు చెయ్యాలి. అమ్మా వాళ్ళూ పొయ్యి దగ్గర కూచుని వేస్తున్నవి వేస్తున్నట్టు, మూకుడులోంచి తీస్తున్నవి తీస్తున్నట్టు గిన్నెల్లోనో, డబ్బాల్లోనో పెట్టి ఇస్తూంటే మేం పిల్లలం డెలివరీ బోయ్స్ లాగా పరుగులు తీసేవాళ్ళం. ఈ పంపకాలకి అటూ ఇటూ పరుగులుతీస్తూ ఉంటే మాకు అనుమానం వచ్చేది, అసలు మేము తినడానికి చివరికి ఏమైనా మిగులుతాయా అని. కానీ కావలసినన్ని ఉండేవి మాక్కూడా. నలుగురికి పెట్టుకోవడంలో ఉండే ఆనందం అమ్మ మాకు చిన్నప్పుడే ఇలా పండగలప్పుడు తెలిసేలా చేసింది. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">ఇక భోజనాలయ్యాక మొదలయ్యేది మా ఆదుర్దా. ఎప్పుడు సాయంకాలం అవుతుందా, ఎప్పుడు చీకటి పడుతుందా అని. ఎప్పుడు ఇవన్నీ తీసికెళ్ళి కాల్చేద్దామా అని. కానీ అది అంత తొందరగా అవ్వదుగా! చాలా సేపటికి గానీ సాయంకాలం అయ్యేది కాదు. ఆ తర్వాత ఇంకా చాలాసేపటికి కాని చీకటి పడేది కాదు. చీకటి పడ్డ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ సామానంతా కాల్చుకోడానికి లేదు. పూజ జరగాలట, ఆ పూజ పూర్తయితేనేగాని సిసింద్రీ ఏమిటి, ఒక కాకరపువ్వొత్తుకూడా వెలిగించకూడదట. ఆ పూజ ఏదో అయ్యి, ఇంటి చుట్టూరా, మెట్లమీదా, ప్రహరీ గోడ మీదా, గోడలో ఉన్న కానాలలో, డాబా పైన పిట్టగోడ మీదా ప్రమిదలు పెట్టాక కానీ మాకు ఆటవిడుపు లేదు. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">హమ్మయ్య! చిట్టచివరకు అసలు దీపావళి మాకు అప్పుడు మొదలు.</span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">చెలరేగి పోయేవాళ్ళం. ఇంట్లో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళూ ప్రమిదల సంగతీ, వాటిల్లో నూనె సంగతీ, వత్తుల సంగతీ చూసుకునేవారు. మాకు ఆ బాదరబందీ లేదు. మందు సామాను కాల్చడమే మా పని. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">మతాబులు, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు వెలుగులు విరజిమ్మేవి. పెన్సిళ్ళు అని ఉండేవి. భూచక్రాలు నేలమీద వెలుగుతూ గిరగిరా తిరుగుతూండేవి.. విష్ణు చక్రాలు ఉండేవి. చేత్తో పట్టుకుని కాలుస్తూంటే భయమేసేది. చేతిని ఊపేసేది తిరిగినంతసేపూ. వెలుగు రవ్వలు మీదపడతాయేమోనని భయం. నల్లటి బిళ్ళ. అది </span><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">పామట! </span><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">వెలిగిస్తే కాలుతూ, దాని బూడిద </span><span style=\"font-family: Verdana;\">ఒత్తుగా, </span><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">నల్లగా పాములాగ మీదికి ఉబికేది. అవుట్లని ఉండేవి. చిన్నవీ, పెద్దవీ. అవిపేలి, ఆ కాగితాలు విడిపోతే అవి ఇంగ్లీషు, తమిళ పేపర్లవై ఉండేవి. ఇక మహాలక్శ్మి బాంబులు. అవీ అంతే చప్పుడు బాగా వచ్చేది. ఇంగ్లీషు, తమిళ పేపర్లే అవి కూడా. సీమటపకాయలని ఉండేవి. సన్నగా, ఎర్రగా, బలహీనంగా పేలేవి. తుపుక్కు తుపుక్కుమంటూ. సిసింద్రీలు. వేలెడంత ఉండేవి కావుగానీ ఏమి హడావిడి చేసేవి? ఆ చిన్న పేపర్ గొట్టం లో మందున్నంతవరకూ నేలమీద చెడుగుడు ఆడినట్లు రెచ్చిపోయి కలతిరిగేసేవి! ఇంచుమించు ఇలాగేకానీ, కొంచెం ఒకింత మందంగా తిరిగేవి, జింకిణీలు. తోలుజింకిణీలు అనేవారు. పలచటి తోలు పైపొరగా ఉన్న గొట్టంలో మందు ధట్టించేవాళ్ళం. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">ఇక తాటాకు టపాకాయలు. పైన తలా, తలకి ఒకపక్క వత్తు, తల మీద ఉన్న తలపాగా నుంచి కిందికి దిగే వస్త్రం లాగా ఒక తాటాకు తోక. పేలుడులో మంచి చప్పుడు. ఒక్కొక్కటీ పేలితే శబ్దం సరిపోదని పది తాటాకు టపాకాయలతో కోట కట్టే వాళ్ళం. దాని మీద ఒక రేకు డబ్బా బోర్లిస్తే, తస్సాదియ్యా, దాని పేలుడు మరింత ధాటిగా ఉండేది. దీని కోసం ఖాళీ అమూల్ డబ్బాలని దాచి ఉంచేవాళ్ళం.</span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">జువ్వల పందాలు ఉండేవి. మేము వాటి గురించి వినడమేగాని ఆ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. కాస్త పెద్దవాళ్ళూ, అనుభవం ఉన్నవాళ్ళూ మైదానల్లోకి వెళ్ళి ఆ పందాలలో పాల్గొనేవారు. ఈ పక్కన కొంతమందీ, ఆ పక్కన కొంతమందీ ఉండి జువ్వలు అంటించి వదిలేవారు. ఎవరి జువ్వలు ఎక్కువ ఎత్తు ఎగిరాయి అన్నది లెఖ్ఖ. ఇటూ, అటూ, ఒకదాని వెనకాల ఒకటి చరచరా పాకుతున్నట్టు ఆకాశంలోకి ఎగిరేవి. ఒక్కోసారి ఈ వీధి వాళ్ళకీ ఆ వీధి వాళ్ళకీ, ఈ పేట వాళ్ళకీ ఆ పేట వాళ్ళకీ పోటీ. ఊరి పొలిమేరల్లో అయితే, ఈ ఊరి వారికీ ఆ ఊరి వారికీ పోటీ. అప్పుడప్పుడూ ప్రమాదాలు కూడా జరిగేవి. పాపం కొంతమందికి ఒళ్ళు కాలేది. </span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">కాసేపటికి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ సామాను అయిపోయేది. ఆ ఇళ్ళలోని పిల్లలు పాపం బిక్కమొహాలు వేసుకుని మా వంక చూస్తూ నిలుచునేవారు. మా ఈడు వాళ్ళే. అమ్మ వాళ్ళని పిలిచి మా సామాను ఇచ్చి మాతోపాటు వాళ్ళని కాల్చుకోమనేది. ఒక్కసారిగా వాళ్ళమొహాలు వెలిగేవి. మతాబులు, చిచ్చుబుడ్డ్ల వెలుతురులో చిన్నబోయినమొహాలు ఎంత చిన్నబోయినట్లు కనపడతాయో, ఆనందంతో ఉన్నమొహాలు అంతగా వెలిగిపోతున్నట్టుగానూ కనపడతాయి. మా సామాను వాళ్ళకి ఇచ్చేస్తున్నారేమిటి అని మాకు అనిపించేది కాదు. మాకూ ఆనందంగా ఉండేది. అందరం కలిసి కాల్చుకునేవాళ్ళం.</span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">ప్రమిదలు మలగడం మొదలయ్యేది. చుట్టుపక్కల, పక్కవీధుల్లోంచి శబ్దాలు సన్నగిల్లేవి. లోపల్నుంచి అమ్మ ‘ఇక చాలురా, లోపలికి రండి. వచ్చి అన్నాలు తినండి’ అంటూ పిలవడం, ఎంతకీ రాకపోతే మొత్తుకోవడం మొదలు పెట్టేది. అయినా మాకు కట్టిపెట్టాలనిపించేది కాదు. ఒక పక్క అలుపు. మరోపక్క ఇంకా తీరని సరదా. ఇక చివరికి అమ్మ వచ్చి మమ్మల్ని రెక్కపట్టుకుని లోపలికి లాక్కెళ్ళేవరకూ వెళ్ళేవాళ్ళం కాదు.</span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">ఇదంతా అయ్యేవరకూ కాని ఆకలి తెలిసేదికాదు. లోపలికి వెళ్ళాక గబగబా పీటలమీద కూర్చుని అన్నం తినేద్దామా అంటే, నూతిదగ్గరకెళ్ళి చేతులూ కాళ్ళూ శుభ్రంగా సబ్బు పెట్టి బాగా తోముకుని, రుద్దుకుని కడుక్కునేవరకూ మమ్మల్ని కంచం దగ్గరకి రానిచ్చేది కాదు అమ్మ.</span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">అలా తిన్నామో లేదో ఇలా నిద్ర ముంచుకు వచ్చేసేది.</span></div>\r\n<div style=\"font-family: -webkit-standard; margin-top: 1em; margin-bottom: 1em;\"><span style=\"font-family: Verdana, Arial, Helvetica, sans-serif;\">అలా ముగిసేది మా ఇంట్లో దీపావళి! </span></div>\r\n<p> </p>\r\n</body>\r\n</html>","tags":"Deepavali, Diwali, Amma, Parakala Prabhakar, Festival, Narasapuram, ","url":"/life-in-general/మా-ఇంట్లో-దీపావళి","thumbnailratio":"16_9","english_url":"/life-in-general/amma-and-deepavali-at-home","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2018-11-16T07:54:53.389Z","img_alt_description":"","short_description":"This is how we celebrated Deepavali at home in Narasapuram in our childhood","embedded":"","english_title":"Amma and Deepavali at Home","modified_dt":"2018-11-16T07:54:53.391Z","__v":0,"editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/life-in-general/మా-ఇంట్లో-దీపావళి","published_dt":"2018-11-16T07:54:53.389Z","published_dt_txt":"16-11-2018","published_dt_time_txt":"16-11-2018 13:24:53 IST","updated_dt_time_txt":"16-11-2018 13:24:53 IST"}
నాన్నగారికి దీపావళి చాలా ప్రియమైన పండుగ. అమ్మకి కూడా ఈ పండుగ అంటే అమితమైన ఇష్టం.
అసలు మా ఇంట్లో దీపావళే పెద్ద పండుగ.
సుమారు నెల్లాళ్ళ ముందునుంచీ ఇంట్లో హడావిడి మొదలయ్యేది.
కనీసం ఇరవై రోజుల ముందైనా కొత్త బట్టలు టైలర్ కి ఇచ్చెయ్యాలి. లేకపోతే పండక్కి కుట్టలేడట! పండగ ముందు గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది. వాడు కూడా ముందు బట్ట నానపెట్టాలి. నాన బెట్టాక కొంత లాగేసి కురచగా అయిపోతుంది బట్ట. నానబెట్టకుండా కుట్టేస్తే కొత్తగా తొడుక్కున్నప్పుడు బానే ఉంటాయి. ఒక రేవు వేస్తే కురచగా, బిగువుగా అయిపోతాయి. అమ్మ అలా అస్సలు ఒప్పుకునేది కాదు; ఎదిగే పిల్లలకి ఓ రెండంగుళాలు పొడవుగానే ఉండాలనేది ఆవిడ సిద్ధాంతం. ఒక్క రేవు వేస్తే పొట్టైపోతే ఆవిడ ఊరుకుంటుందా!?
ఎన్ని పనులున్నా, దేశంలో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా దీపావళికి ఒకటి రెండు రోజుల ముందే నాన్నగారు ఇంటికి చేరుకునేవారు. మందుగుండు సామానులు కొనిపెట్టడానికి మమ్మల్ని ఆయనే స్వయంగా బజారు తీసుకెళ్ళేవారు. మేము ఏమిఅడిగితే అది, ఎంత ఖర్చవుతుందో లెఖ్ఖ చెయ్యకుండా కొనిపెట్టేవారు. మాకు కావలసినవన్నీ కావలసినన్ని కొనేసుకునేవాళ్ళం. బుట్టలు బుట్టలు దీపావళి మందుగుండు సామానులు ఇంటికి తీసుకొస్తే ఖర్చు గురించి ఆలోచించి పాపం అమ్మ కొంచెం తల్లడిల్లేది. అయినా ఏమనేది కాదు.
కొన్ని సామానులు ఇంటిలోనే, మేమే, తయారు చేసుకునేవాళ్ళం. చిచ్చుబుడ్లు, మతాబులు, తారాజువ్వలు, తాటాకు టపాకాయలు, సిసింద్రీలు చేసుకునేవాళ్ళం. అవి తయారుచేసుకోడానికి కావలసిన సూరేకారం, మతాబు మందు లాంటివి శారదా హాల్ దగ్గర ఓ పక్కసందులో దొరికేవి. అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. బావ బాగా శ్రద్ధ పెట్టేవాడు ఇవి తయారు చెయ్యడానికి. అవి బాగా కాలడానికీ, పేలడానికీ, ఎగరడానికీ మందుల పాళ్ళు కలపడంలో ఉంటుంది కిటుకు.
పదిహేను ఇరవై రోజులముందు నుంచి ఇంటిలో హడావిడి మొదలయ్యేది. ఇంటిలో ఉన్న పాత పేపర్లు గెడంచా లోంచి తియ్యాలి. వాటిని సరిపడగా కత్తిరించాలి, మతాబు సైజును బట్టి. సిసింద్రీలకు చిన్న సైజులో కట్ చెయ్యాలి. తాటాకు టపాకాయలు చెయ్యడానికి మంచి నాణ్యమైన తాటాకులు తేవాలి. వీటికి కావలసిన మందును సరైన పాళ్ళలో కలిపాలి. కుప్పలుగా పోసి పెట్టుకోవాలి. ఇక అలా పోసిపెట్టుకున్న మందుని గట్టిగా మతాబు గొట్టాల్లోకీ, సిసింద్రీల్లోకీ, జువ్వల్లోకీ దట్టించాలి. వదులుగా దట్టిస్తే బాగా కాలవు. అలా అని మరీ గట్టిగా దట్టిస్తే కూడా కుదరదు. అసలు సరిగా అంటుకోనే అంటుకోవు. సమంగా ఉండాలి దట్టింపు.
మా మందుగుండు సామాను తయారీ ఇలా ఉంటే, ఇక ఇంట్లో ప్రమిదలకు వత్తులు చేసే పని తక్కువేమీ కాదు. పెద్దవాళ్ళు దూదిని తొడమీద పెట్టుకుని అరచేత్తొ నలుపుతూ వత్తుల్లాగ చుట్టేవాళ్ళు. నిరుటి సంవత్సరం ప్రమిదలు ఎన్ని ఉన్నాయో చూసుకుని ఇప్పుడు ఇంకా ఎన్ని కావాలో ఉజ్జాయింపు వేసుకుని అమ్మ కొత్త ప్రమిదలు తెప్పించేది. ఓ రోజు ముందు తెప్పిస్తే కాదు. కనీసం పది రోజులముందు తెప్పించుకుని, వాటిని రోజూ నీళ్ళల్లో నానబెట్టాలి. ఆ మట్టి ప్రమిదలు నీళ్ళల్లో నానకపోతే నూనె పీల్చేస్తాయట. ప్రమిదలు అంతంత నూనె అలా పీల్చేస్తే ఎవడు తిన్నట్టూ? అమ్మ ఊరుకుంటుందా? అందుకే ప్రమిదల్ని వారం రోజుల ముందే తెప్పించి, ఒక పీపా నిండా నీరు పట్టించి, దాంట్లో వాటిని నానపెట్టించేది.
మేము ఇంట్లో చేసుకునే మందులన్నీ పండక్కి ఓ వారం ముందే తయారైపోవాలి. ఎందుకంటే అవన్నీ బాగా ఎర్రటి ఎండలో ఎండాలి. లేకపోతే అవేవీ సరిగా కాలవు, పేలవు అనేవాళ్ళు. బజార్లో కొన్నవి కూడా మరీ వారం పది రోజులు కాకపోయినా ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టే వాళ్ళం. రోజూ ఎండ రాగానే ఈ సామానంతా పట్టుకుని డాబా మీదికి వెళ్ళడం. అన్నీ జాగ్రత్తగా బరకం మీద పరవడం. మళ్ళీ సాయంకాలం ఎండ తగ్గుముఖం పట్టేక అన్నీ జాగ్రత్తగా కిందికి తెచ్చుకోవడం. ఇదో పెద్ద కార్యక్రమం. చాలా శ్రద్దగా చేసేవాళ్ళం. అప్పుడప్పుడూ మధ్య మధ్యలో వెళ్ళి ఎలా ఎండుతున్నాయో చూసుకునేవాళ్ళం. సిగరెట్లు కాల్చేవాళ్ళు మేడమీదికి వెళ్ళకుండా జాగ్రత్తపడ్డం మరో ఎత్తు. కాస్తంత మబ్బుగా అనిపిస్తే మరీ జాగ్రత్తగా ఉండాలి. తడిసేయా, అవి మరింకెందుకూ పనికి రావు కదా!
ఇంతిలా ఇన్నిరోజులు ప్రయాస పడ్డాక చివరికి పండగ రోజు రానే వచ్చేది.
పొద్దున్నే లేచిపోవాలి. పొద్దున్నే లేవాల్సివచ్చినపుడే కదా ఇంకా కాసేపు పడుకోవాలనిపించేది. ఇక నలుగు పెట్టుకుని తలస్నానం. కుంకుడుకాయ రసం కళ్ళల్లో పడకుండా నేనెప్పుడూ తలస్నానం చెయ్యలేదు. ఒక కన్ను ఎరుపెక్కి ఉండేది. మండేది. రెండు ఉప్పు కణికలు నోట్లో వేసుకుంటే మంట తగ్గేది. అదో గమ్మత్తు! దీని వెనకాల ఉన్న శాస్త్రం ఏమిటో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు.
కొత్త చొక్కా చివళ్ళకీ నిక్కరు చివళ్ళకీ పసుపు అంటించికానీ అమ్మ కొత్తబట్టలు తొడిగేది కాదు. నాకూ మా చిన్నాడికీ ఒకే రకం బట్టలు. బట్టలు కూడ టైలర్ చివరి ఘడియ వరకూ ఇచ్చేవాడు కాదు. రేపు రా, మాపు రా అని తిప్పుకునేవాడు. అందర్నీ అలాగే తిప్పుకునేవాడట. మరి ఎవరికి తిప్పుకోకుండా ఇచ్చేవాడో తెలియదు. మాకు టైమ్ కి బట్టలు అమర్చాడు టైలర్ అన్నవాళ్ళు నాకు ఒక్కళ్ళూ కనపడలేదు. మేము చూసి చూసి నిద్రపోయాక రేపు పండుగ అనగా రాత్రి పొద్దుపోయాక వచ్చేవి మా కొత్త బటలు. సరే పోనీ ఆ వచ్చిన కొత్తబట్టలు వేసేసుకుని ఆడుకోడానికి పరిగెడదామా అంటే కుదరదు. ఇంట్లో చేసే పిండివంటలు చుట్టుపక్కల వారికీ, ఇరుగు పొరుగువారికీ పంపకాలు చెయ్యాలి. అమ్మా వాళ్ళూ పొయ్యి దగ్గర కూచుని వేస్తున్నవి వేస్తున్నట్టు, మూకుడులోంచి తీస్తున్నవి తీస్తున్నట్టు గిన్నెల్లోనో, డబ్బాల్లోనో పెట్టి ఇస్తూంటే మేం పిల్లలం డెలివరీ బోయ్స్ లాగా పరుగులు తీసేవాళ్ళం. ఈ పంపకాలకి అటూ ఇటూ పరుగులుతీస్తూ ఉంటే మాకు అనుమానం వచ్చేది, అసలు మేము తినడానికి చివరికి ఏమైనా మిగులుతాయా అని. కానీ కావలసినన్ని ఉండేవి మాక్కూడా. నలుగురికి పెట్టుకోవడంలో ఉండే ఆనందం అమ్మ మాకు చిన్నప్పుడే ఇలా పండగలప్పుడు తెలిసేలా చేసింది.
ఇక భోజనాలయ్యాక మొదలయ్యేది మా ఆదుర్దా. ఎప్పుడు సాయంకాలం అవుతుందా, ఎప్పుడు చీకటి పడుతుందా అని. ఎప్పుడు ఇవన్నీ తీసికెళ్ళి కాల్చేద్దామా అని. కానీ అది అంత తొందరగా అవ్వదుగా! చాలా సేపటికి గానీ సాయంకాలం అయ్యేది కాదు. ఆ తర్వాత ఇంకా చాలాసేపటికి కాని చీకటి పడేది కాదు. చీకటి పడ్డ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ సామానంతా కాల్చుకోడానికి లేదు. పూజ జరగాలట, ఆ పూజ పూర్తయితేనేగాని సిసింద్రీ ఏమిటి, ఒక కాకరపువ్వొత్తుకూడా వెలిగించకూడదట. ఆ పూజ ఏదో అయ్యి, ఇంటి చుట్టూరా, మెట్లమీదా, ప్రహరీ గోడ మీదా, గోడలో ఉన్న కానాలలో, డాబా పైన పిట్టగోడ మీదా ప్రమిదలు పెట్టాక కానీ మాకు ఆటవిడుపు లేదు.
హమ్మయ్య! చిట్టచివరకు అసలు దీపావళి మాకు అప్పుడు మొదలు.
చెలరేగి పోయేవాళ్ళం. ఇంట్లో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళూ ప్రమిదల సంగతీ, వాటిల్లో నూనె సంగతీ, వత్తుల సంగతీ చూసుకునేవారు. మాకు ఆ బాదరబందీ లేదు. మందు సామాను కాల్చడమే మా పని.
మతాబులు, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు వెలుగులు విరజిమ్మేవి. పెన్సిళ్ళు అని ఉండేవి. భూచక్రాలు నేలమీద వెలుగుతూ గిరగిరా తిరుగుతూండేవి.. విష్ణు చక్రాలు ఉండేవి. చేత్తో పట్టుకుని కాలుస్తూంటే భయమేసేది. చేతిని ఊపేసేది తిరిగినంతసేపూ. వెలుగు రవ్వలు మీదపడతాయేమోనని భయం. నల్లటి బిళ్ళ. అది పామట! వెలిగిస్తే కాలుతూ, దాని బూడిద ఒత్తుగా, నల్లగా పాములాగ మీదికి ఉబికేది. అవుట్లని ఉండేవి. చిన్నవీ, పెద్దవీ. అవిపేలి, ఆ కాగితాలు విడిపోతే అవి ఇంగ్లీషు, తమిళ పేపర్లవై ఉండేవి. ఇక మహాలక్శ్మి బాంబులు. అవీ అంతే చప్పుడు బాగా వచ్చేది. ఇంగ్లీషు, తమిళ పేపర్లే అవి కూడా. సీమటపకాయలని ఉండేవి. సన్నగా, ఎర్రగా, బలహీనంగా పేలేవి. తుపుక్కు తుపుక్కుమంటూ. సిసింద్రీలు. వేలెడంత ఉండేవి కావుగానీ ఏమి హడావిడి చేసేవి? ఆ చిన్న పేపర్ గొట్టం లో మందున్నంతవరకూ నేలమీద చెడుగుడు ఆడినట్లు రెచ్చిపోయి కలతిరిగేసేవి! ఇంచుమించు ఇలాగేకానీ, కొంచెం ఒకింత మందంగా తిరిగేవి, జింకిణీలు. తోలుజింకిణీలు అనేవారు. పలచటి తోలు పైపొరగా ఉన్న గొట్టంలో మందు ధట్టించేవాళ్ళం.
ఇక తాటాకు టపాకాయలు. పైన తలా, తలకి ఒకపక్క వత్తు, తల మీద ఉన్న తలపాగా నుంచి కిందికి దిగే వస్త్రం లాగా ఒక తాటాకు తోక. పేలుడులో మంచి చప్పుడు. ఒక్కొక్కటీ పేలితే శబ్దం సరిపోదని పది తాటాకు టపాకాయలతో కోట కట్టే వాళ్ళం. దాని మీద ఒక రేకు డబ్బా బోర్లిస్తే, తస్సాదియ్యా, దాని పేలుడు మరింత ధాటిగా ఉండేది. దీని కోసం ఖాళీ అమూల్ డబ్బాలని దాచి ఉంచేవాళ్ళం.
జువ్వల పందాలు ఉండేవి. మేము వాటి గురించి వినడమేగాని ఆ జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. కాస్త పెద్దవాళ్ళూ, అనుభవం ఉన్నవాళ్ళూ మైదానల్లోకి వెళ్ళి ఆ పందాలలో పాల్గొనేవారు. ఈ పక్కన కొంతమందీ, ఆ పక్కన కొంతమందీ ఉండి జువ్వలు అంటించి వదిలేవారు. ఎవరి జువ్వలు ఎక్కువ ఎత్తు ఎగిరాయి అన్నది లెఖ్ఖ. ఇటూ, అటూ, ఒకదాని వెనకాల ఒకటి చరచరా పాకుతున్నట్టు ఆకాశంలోకి ఎగిరేవి. ఒక్కోసారి ఈ వీధి వాళ్ళకీ ఆ వీధి వాళ్ళకీ, ఈ పేట వాళ్ళకీ ఆ పేట వాళ్ళకీ పోటీ. ఊరి పొలిమేరల్లో అయితే, ఈ ఊరి వారికీ ఆ ఊరి వారికీ పోటీ. అప్పుడప్పుడూ ప్రమాదాలు కూడా జరిగేవి. పాపం కొంతమందికి ఒళ్ళు కాలేది.
కాసేపటికి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ సామాను అయిపోయేది. ఆ ఇళ్ళలోని పిల్లలు పాపం బిక్కమొహాలు వేసుకుని మా వంక చూస్తూ నిలుచునేవారు. మా ఈడు వాళ్ళే. అమ్మ వాళ్ళని పిలిచి మా సామాను ఇచ్చి మాతోపాటు వాళ్ళని కాల్చుకోమనేది. ఒక్కసారిగా వాళ్ళమొహాలు వెలిగేవి. మతాబులు, చిచ్చుబుడ్డ్ల వెలుతురులో చిన్నబోయినమొహాలు ఎంత చిన్నబోయినట్లు కనపడతాయో, ఆనందంతో ఉన్నమొహాలు అంతగా వెలిగిపోతున్నట్టుగానూ కనపడతాయి. మా సామాను వాళ్ళకి ఇచ్చేస్తున్నారేమిటి అని మాకు అనిపించేది కాదు. మాకూ ఆనందంగా ఉండేది. అందరం కలిసి కాల్చుకునేవాళ్ళం.
ప్రమిదలు మలగడం మొదలయ్యేది. చుట్టుపక్కల, పక్కవీధుల్లోంచి శబ్దాలు సన్నగిల్లేవి. లోపల్నుంచి అమ్మ ‘ఇక చాలురా, లోపలికి రండి. వచ్చి అన్నాలు తినండి’ అంటూ పిలవడం, ఎంతకీ రాకపోతే మొత్తుకోవడం మొదలు పెట్టేది. అయినా మాకు కట్టిపెట్టాలనిపించేది కాదు. ఒక పక్క అలుపు. మరోపక్క ఇంకా తీరని సరదా. ఇక చివరికి అమ్మ వచ్చి మమ్మల్ని రెక్కపట్టుకుని లోపలికి లాక్కెళ్ళేవరకూ వెళ్ళేవాళ్ళం కాదు.
ఇదంతా అయ్యేవరకూ కాని ఆకలి తెలిసేదికాదు. లోపలికి వెళ్ళాక గబగబా పీటలమీద కూర్చుని అన్నం తినేద్దామా అంటే, నూతిదగ్గరకెళ్ళి చేతులూ కాళ్ళూ శుభ్రంగా సబ్బు పెట్టి బాగా తోముకుని, రుద్దుకుని కడుక్కునేవరకూ మమ్మల్ని కంచం దగ్గరకి రానిచ్చేది కాదు అమ్మ.
అలా తిన్నామో లేదో ఇలా నిద్ర ముంచుకు వచ్చేసేది.
అలా ముగిసేది మా ఇంట్లో దీపావళి!