14-08-2020published_dt 2020-08-14T13:39:49.377Z14-08-2020 19:09:49 IST Updated On 14-08-2020 19:12:21 ISTmodified_dt 2020-08-14T13:42:21.966ZUpdated On 14-08-20202020-08-14T13:39:49.377Z14-08-2020 2020-08-14T13:39:49.377Z - 2020-08-14T13:42:21.966Z - 14-08-2020
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2020-08-14T13:39:49.377Z"},{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2020-08-14T13:40:45.189Z"},{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2020-08-14T13:42:21.965Z"}],"comments":[],"video_status":"0","view_count":2123,"status":"active","_id":"5f3694254cc44728d4600571","category_id":"5bdbf61dd07281474d08ae94","category_name":"Communications","title":"Farewell, Mahaa News","metatitle":"Bidding Farewell to Mahaa News ","metadescription":"Parakala wrote a letter to the employees of Mahaa News while stepping down from the Board of Directors and relinquishing the responsibility of its day to supervision","metakeywords":"Mahaa News, Parakala, Resignation","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p style=\"text-align: center;\"><span lang=\"TE\" style=\"font-size: 12pt; font-family: Gautami, sans-serif;\"> </span><span style=\"font-family: Gautami, sans-serif; font-size: 20pt; text-align: center;\">శెలవు</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif; text-align: right;\" align=\"right\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">13 </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఆగస్టు </span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">2020 </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మహా న్యూస్ కుటుంబ సభ్యులందరికీ</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">సప్రేమ నమస్కారములు.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-GB\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఈ సాయంత్రం నేను</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">శ్రీమతి ఊమాదేవి కోట మహాన్యూస్ యాజమాన్య కంపెనీ మోనికా బ్రాడ్కాస్టింగ్ ప్రైవెట్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి వైదొలగాము. నాతోపాటుగా బోర్డులోకి వచ్చిన శ్రీ భాస్కరమూర్తి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన కోవిడ్ మహమ్మరికి బలయ్యారనే విషయం మీకు తెలిసిందే.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మేము ముగ్గురమూ మోనికాలో మెజారిటీ వాటా తీసుకుని మహాన్యూస్ ను మీ అందరి సహాయ సహకారాలతో ఒక ఉత్తమ తెలుగు ఛానెల్ గా తీర్చిదిద్దాలనే తలంపుతో నడుంకట్టి ఉపక్రమించాం. మా ముగ్గురి దగ్గర ఉన్న ధనరాశి అందుకు పూర్తిగా సరిపోదనే సంగతి మాకు తెలుసు. అయితే మా ముగ్గురికి ఉన్న పరిచయాలతో కొంతమంది వెంచర్ ఫండ్ ఇన్వెస్టర్లతో మాట్లాడి వారు మా ఈ ప్రయత్నానికి సహకరించేలా ఒప్పించగలిగాము. వారు సరిపడ్డంత వనరులను ఈక్విటీగా మాకు సమకూర్చి</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">యాజమాన్యంలో ఏ మాత్రం జోక్యం చేసుకోకుండా పూర్తి స్వేఛ్ఛతో మేము ఛానెల్ నడిపేందుకు అంగీకరించి ముందుకు వచ్చారు. తెలుగులో విజయవంతమైతే తతిమ్మా దక్షిణభారత భాషలలోకి కూడా అనతికాలంలొనే విస్తరించడానికి కూడా ఉత్సాహం చూపించారు. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఆ ఒప్పందం దరిమిలా మేము బోర్డులో ప్రవేశించి</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">కొంత పెట్టుబడి కంపెనీలోకి తెచ్చి యాజమాన్య బాధ్యతలు పూర్తి స్థాయిలో తీసుకున్నాము. కొన్ని మార్పులు చేర్పులు చేసాము. కార్యాలయం పరిశుభ్రత లగాయితు ప్రోగ్రామింగ్</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">స్క్రీన్ లుక్</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">రిపోర్టింగ్ పంథా</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">చర్చల ఒరవడి</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">న్యూస్ ప్రెజంటేషన్</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మొదలైన వాటిల్లో మంచి మార్పులు తెచ్చాము. ఒక ఇంట్లో ఉన్న అన్ని వయస్సులవారికీ</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అభిరుచులు కలవారికీ మహాన్యూస్ లో ఏదో ఒక కార్యక్రమం తప్పకుండా ఉండేలాగా చానెల్ రూపురేఖల్ని తీర్చాము. తెలుగు భాష</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">సంస్కృతులకు వార్తాచానెల్ లో చోటు కల్పించాము. చిన్నపిల్లల్ని కూడా విస్మరించలేదు. కేంద్ర కార్యాలయంలో పనిచేసేవారికి యథాశక్తి మెరుగైన సౌకర్యాలు కలుగజేసాము. క్షేత్రస్థాయిలో రిపోర్టింగ్ చేసేవారికి కలిగినంతలో పారితోషికం ఇవ్వడం ప్రారంభించాము. రిపోర్టర్ల మీద మార్కెటింగ్ భారాన్ని పూర్తిగా తొలగించి వారు అడ్వర్టైజ్ మెంట్ల నిమిత్తంగా వార్తల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేకుండా</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">పక్క చూపులు చూసే పని లేకుండా చేసాం. మహా న్యూస్ కేవలం ఆంధ్రప్రదేశ్ కే ప్రాధాన్యత ఇచ్చే చానెల్ కాదు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఇది తెలుగు చానెల్</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">రెండు తెలుగు రాష్ట్రాలకూ సమాన ప్రాధాన్యత ఇచ్చే చానెల్ అన్నది బలంగా రూఢి చెయ్యగలిగాం. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వార్తను వార్త గా తీసుకోవాలి</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఏ రాజకీయ పార్టీకి గాని</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వ్యక్తులకు గాని మనం బాకా ఊదకూడదు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఎవరినీ వ్యతిరేకిస్తూ పనిగట్టుకుని వెంటాడకూడదు అనేది నియమంగా పెట్టుకున్నాం. నిస్పాక్షికతను ఒక నిష్ఠగా పెట్టుకున్నాం. సమాజంలోని అన్ని అభిప్రాయాలనూ</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">గొంతుకలనూ ప్రజలకు వినిపించడం ఒక వ్రతంగా స్వీకరించి పనిచేసాం. మహాన్యూస్ నిస్పక్షపాతంగా వార్తలను కథనాలను అందిస్తుంది అన్న గౌరవాన్ని సంపాదించుకున్నాం. వీక్షకుల విశ్వాసాన్ని చూరగొన్నాం</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వారి మన్ననలను పొందగలిగాం. చానెల్ కనెక్టివిటీని బాగా మెరుగుపరచాం. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వార్తలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ప్రోగ్రాముల్లో నాణ్యత పెంచి</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">కనెక్టివిటీని మరింత విస్తరింపచేసిన తర్వాత తగినంత ప్రజాదరణ పొంది</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">రేటింగును బాగా మెరుగు పరుచుకుని తత్ఫలితంగా ఆదాయం పెరగడం మొదలవ్వగానే నామమాత్రంగా పారితోషికం తీసుకుంటూ క్షేత్రస్థాయిలో కష్టపడి నిబద్ధతతో పనిచేస్తున్న రిపోర్టర్లకు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">స్ట్రింగర్లకు జీతాలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">పారితోషికాలూ పెంచుదామని సంకల్పించాం. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మేమనుకున్నవి ఒకొక్కటీ ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెడుతుండగా హఠాత్తుగా కరోనా మహమ్మారి మీదపడింది. అప్పుడప్పుడే కొంచెం కొంచెంగా పుంజుకుంటున్న చానెల్ ఆదాయం ఈ విపత్తు వల్ల అడుగంటడం మొదలుపెట్టింది. ఇచ్చిన రిలీజ్ ఆర్డర్లను కూడా కొంతమంది ప్రకటనకర్తలు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకోని వారు రేట్లు తగ్గించమనో</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అరువు రాసుకోండనో చెప్పడం ప్రారంభించారు. ఈ క్లిష్టపరిస్థితి మన ఒక్క సంస్థకే కాదు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">యావత్ దేశంలో</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మొత్తం ప్రపంచంలో ఉన్న మీడియా సంస్థలన్నింటికీ ఎదురయ్యింది. దశాబ్దాలుగా లాభాలనార్జించిన మీడియా సంస్థలు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యి జీతాలు తగ్గించడం</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఉద్యోగుల సంఖ్య కుదించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితికి వచ్చేసాయి. క్రమంతప్పకుండా ఒకటవ తారీకున ఉద్యోగుల ఎకౌంట్లలో జీతాలు వేస్తారనే ప్రతిష్ఠను సంపాదించుకున్నప్రముఖ సంస్థలు కూడా తల్లడిల్లిపోవడం</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">క్రమం తప్పడం మనం కళ్ళారా చూసాం. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">యాజమాన్యం చేపట్టి మూడు నెలలు తిరక్కుండానే మాకు ఎదురైన పరిస్థితి ఇది. ఇది ఇలా ఉంటే</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మాకు ధనరాశి సమకూరుస్తానన్న వెంచర్ క్యాపిటల్ ఫండ్ కూడా ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంది. లాక్ డౌన్ ఇన్నాళ్ళు కొనసాగుతుందని మనమూ ఊహించలేదు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వారూ అంచనా వెయ్యలేకపోయారు. కోవిడ్ పరిణామాలు ఆర్థిక వ్యవస్థ మీద ఇంత కాలం ఇంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎవరూ పసిగట్టలేకపోయారు. రెండు మూడు నెలలు నోరు కట్టుకుని కాలం వెళ్ళబుచ్చితే పరిస్థితులు చక్కబడతాయని అందరం ఆశించాము. వారు కూడా రెండు మూడు నెలల్లో ధనరాశిని అందుబాటులోకి తేగలమనే విశ్వాసాన్ని మాకు ఇచ్చారు. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">కానీ పరిస్థితులను గమనిస్తే కోవిడ్ కష్టాలు ఇప్పుడప్పుడే తెమిలేలా కనపడ్డం లేదు. ఎప్పుడు మళ్ళీ వారు మాకు ఆర్థిక వనరులను సమకూర్చగలరో తెలియని అనిశ్చిత పరిస్థితి. మారిన పరిస్థితుల కారణంగా వారి ఫండింగ్ ప్రాధమ్యాలలో మీడియా రంగం ఎక్కడో అట్టడుగుకు వెళ్ళిపోయింది. మహా కుటుంబ సభ్యులైన మీకు సమయానికి జీతాలు ఇవ్వలేని</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">కనీసం ఎప్పుడు ఇవ్వగలమో చెప్పలేని దుస్థితి మాది. మీ కష్టాలు మాకు తెలియనివి కావు. నెలయ్యేటప్పటికి ఇంటి అద్దె దగ్గర్నుంచి నెలవారీ సరుకుల కొనుగోలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఈఎంఐ లు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఇంట్లో పెద్దలకు మందులు వంటి ఖర్చులు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">పిల్లల అవసరాలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఇవేవీ వాయిదా వేసుకోలేరు కదా. అయినా పళ్ళుబిగపట్టుకుని ఇన్నాళ్ళూ బండి లాక్కొచ్చారు. మీలో కొంతమంది సహనం కోల్పోయి నన్నుఅనామక సోషల్ మీడియా ఖాతాలనుంచి అమ్మ ఆలి అంటూ పచ్చి బూతులు తిడుతూ పోస్టులు కూడా పెట్టారు. నేనేమీ అనుకోలేదు. కష్టాలు అనుభవించే వారి కడుపు మంట నేను అర్ధం చేసుకోగలను కాబట్టి. అనేక సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలలో</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ప్రజాక్షేత్రంలో పనిచేసిన వాడిగా దూషణ భూషణ తిరస్కారాలు నాకు అలవాటే. గనుక నేను మీ పరుష పదాలను తప్పుగా అర్ధం చేసుకోలేదు. కానీ మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నానే అనే స్పృహ మాత్రం నాకు బాగా క్లేశాన్ని కలిగించింది.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అందువల్ల మహాన్యూస్ ను ఈ ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కించగల మరొక ఇన్వెస్టర్ ఎవరైనా దొరుకుతారేమోనని గాలింపు ప్రారంభించాను. వెతగ్గా వెతగ్గా ముంబయికి చెందిన శ్రీయుతులు మోహిత్ సింఘాల్</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అశోక్ శ్రీవాస్తవ్ ల బృందం ఆసక్తి కనబరిచారు. వారికి ఉత్తరోత్తరా మరాఠీ లో కూడా ఒక చానెల్ నడపాలనే ఆలోచన కూడా ఉందని</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఇక్కడ కొంత అనుభవాన్ని గడించి అక్కడ దానిని ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మిగతావి ఎలా ఉన్నా వారు ముందు మీ ఆర్థిక ఇబ్బందులు తీర్చగలరు. ముందు కడుపంటూ నిండితే</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">కనీస అవసరాలు తీరితే</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మిగతా విషయాలు ఒకొక్కటిగా అవే సర్దుకుంటాయి. అలా అనుకుని</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మేము కొంత వాటా కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లకు ఇవ్వడానికి నిశ్చయించాము. రోజు వారీ నిర్వహణ బాధ్యతలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఎడిటోరియల్ పాలసీ నిర్దేశన కూడా వారు కోరుకున్నారు. నిజానికి వారు చానెల్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకునేంత పెద్ద ధనరాశినేమీ తీసుకురావడం లేదు. కాని</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మనం నిస్సహాయ స్థితిలో వాటా ఇవ్వజూపినప్పుడు వారు పెట్టే షరతులకు ఒప్పుకోవలసిందే కదా. ఎక్కువ కాలం బేరసారాలు ఆడడం వల్ల మీకు నెలజీతాలు ఇంకా ఆలస్యం అవుతాయి అనే బెంగ కూడా మనసులో ఉండి సరేనని ఒప్పుకున్నాము. ఒప్పుకోక తప్పలేదు. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఇప్పటివరకూ మీకు రావాల్సిన జీతాల తాలూకు బాకీలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">,</span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\"> ఇతర చెల్లింపులకు కూడా వారు పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఈ విషయం ఈ ఒప్పందం పట్ల నన్ను మరింత సానుకూలుణ్ణి చేసింది. మీ పాత బాకీల చెల్లింపుల విషయంలో మిమ్మల్ని ఎటువంటి ఆందోళనకూ</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అసౌకర్యానికీ లోను చెయ్యమని నమ్మకంగా వారు నాకు చెప్పారు.</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వారు మమ్మల్ని బోర్డులో కొనసాగమనీ</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">స్థూలంగా చానెల్ కు మార్గనిర్దేశనం చెయ్యమనీ కోరారు. కానీ</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మాకు అది ఆమోదయోగ్యంగా అనిపించలేదు. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వారి అభిప్రాయాలేమిటో మాకు పూర్తిగా తెలియదు. వారు వివిధ రాజకీయ సామాజిక ఆర్థిక విషయాల మీద ఏ రకమైన వైఖరి అవలంబిస్తారో మాకు ఎరుక లేదు. వారి విలువలేమిటో</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ప్రమాణాలేమిటో మాకు అవగాహన లేదు. వారిని ఒకటి రెండు సార్లు కలిసి మాట్లాడిన దరిమిలా ఇప్పటికి నాకున్న అంచనా ప్రకారం వారు నిస్పక్షపాతంగా ఉన్నత ప్రమాణాలతో చానెల్ నడుపుతారనే అనుకుంటున్నాను. కానీ</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\"> ఇలాంటి విషయాలలో ఎటుపోయి ఎటు వస్తుందో ముందే ఊహించడం కష్టం. కేవలం బోర్డు సభ్యత్వానికి పరిమితమయ్యి ఒక టీవీ చానెల్ కు మూణ్ణెల్లకొకసారి స్థూలంగా విధాన నిర్ణయం తీసుకుని మార్గ నిర్దేశనం చేస్తే సరిపోదన్నది నా నిశ్చిత అభిప్రాయం. ఎప్పటికప్పుడు క్షణాల మీద జరుగుతున్న పరిణామాల పట్ల మన వైఖరిని నిర్ణయించుకుని దాన్ని తెరమీద ప్రతిఫలించేటట్టు చెయ్యాలి. వార్తను ఎంచుకోవడం దగ్గర్నుంచి</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">దాన్ని రాసిన విధానం</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">చెప్పిన స్వరం మన వైఖరిని ఇట్టే తేటతెల్లం చేస్తాయి. అందుకని చానెల్ రోజువారీ నడక</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">స్థూలంగా దాని మార్గదర్శనం ఈ రెండూ కూడా కొత్త ఇన్వెస్టర్ల చేతుల్లోనే ఉండి ఒక్క చేతిమీదగా నడిస్తేనే సబబని అనిపించింది. వారికీ మనశ్శాంతి ఉంటుంది</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మాకూ మానసిక ఒత్తిడి ఉండదు. అదీ కాక</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, ‘</span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">’ </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అన్న సూత్రాన్ని మా అమ్మ నాకు చిన్నప్పటినుంచీ నూరిపోసింది. ఆ విధంగా చూసినా మేము కంపెనీ బోర్డు నుండి</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">చానెల్ రోజువారీ నిర్వహణ బాధ్యతల నుండి నిష్క్రమించడమే ఉత్తమమైన మార్గంగా మాకు తోచింది.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">కోవిడ్ మహమ్మారి కనుక అడ్డంపడకపోయి ఉంటే ఈ ఐదారు నెలల్లో మేము అనుకున్నవన్నీ చేసి మీ అందరి సహాయ సహకారాలతో మన చానెల్ ను మొదటి నాలుగైదు స్థానాల్లో ఖచ్చితంగా నిలబెట్టి ఉండగలిగే వాళ్ళం. మన కార్యక్రమాల నాణ్యత</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">వైవిధ్యం గురించి వివిధ వర్గాలనుంచి వస్తున్న ప్రశంసలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">యూట్యూబ్ లో మన వీడియోలకు పెరుగుతున్న ఆదరణలే దీనికి నిదర్శనం. కాని దురదృష్టవశాత్తు కాలం కలిసిరాలేదు. </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మీ అందరితో ఇన్ని నెలలు కలిసి పనిచెయ్యడం మాకు కలిగిన భాగ్యంగా మేము భావిస్తున్నాము. మీరందరూ మా పట్ల చూపించిన గౌరవ మర్యాదలు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అభిమానం</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఆప్యాయత</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఆపేక్షలు మేము ఎన్నటికీ మరువలేము. గత మూడు నాలుగు నెలలుగా మీరు మా వల్ల ఆర్థిక కష్టాలకు లోనైనా</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మా పట్ల మీకున్న ఆదరణవల్ల సహనం వహించారు. మీకు మా కృతజ్ఞతలు. అలా సహించడానికి మీకు సహకరించిన మీ జీవిత భాగస్వాములకు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">పిల్లలకు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">తల్లిదండ్రులకు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">అవసరానికి మీకు అప్పులు ఇచ్చి ఆదుకుని మీరు ధైర్యం కోల్పోకుండా చూసిన మీ మిత్రులకు కూడా మా ధన్యవాదాలు.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">కొత్త బృందం మహా న్యూస్ ను బాగా వృద్ధిలోకి తెస్తుందని నా నమ్మకం. మీరందరూ కొత్తవారికి త్రికరణ శుద్ధిగా సహకరించి</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">మన చానెల్ ను అగ్రగామిగా నిలబెట్టడానికి వారు చేసే ప్రతి ప్రయత్నంలోనూ వెన్నుదన్నుగా ఉంటారని ఆశిస్తున్నాను.</span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">శెలవు</span><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\">, </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">ఇట్లు </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">భవదీయుడు </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"TE\" style=\"font-family: Gautami, sans-serif;\">డా. పరకాల ప్రభాకర్ </span></p>\r\n<p class=\"MsoNormal\" style=\"margin: 0cm 0cm 0.0001pt; font-size: medium; font-family: Calibri, sans-serif;\"><span lang=\"EN-US\" style=\"font-family: Gautami, sans-serif;\"> </span></p>\r\n</body>\r\n</html>","tags":"Parakala, MahaaNews, TeluguTV, ","url":"/communications/farewell-mahaa-news","thumbnailratio":"16_9","english_url":"/communications/farewell-mahaa-news","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2020-08-14T13:39:49.377Z","img_alt_description":"","short_description":"This is a detailed letter written by Parakala Prabhakar to the employees of Mahaa News while stepping down from the Board of the Company that runs the Channel and relinquishing the responsibility of monitoring its day to day affairs..","embedded":"","english_title":"Farewell, Mahaa News","__v":0,"modified_dt":"2020-08-14T13:42:21.966Z","editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/communications/farewell-mahaa-news","published_dt":"2020-08-14T13:39:49.377Z","published_dt_txt":"14-08-2020","published_dt_time_txt":"14-08-2020 19:09:49 IST","updated_dt_time_txt":"14-08-2020 19:12:21 IST"}
శెలవు13 ఆగస్టు 2020 మహా న్యూస్ కుటుంబ సభ్యులందరికీ, సప్రేమ నమస్కారములు.ఈ సాయంత్రం నేను, శ్రీమతి ఊమాదేవి కోట మహాన్యూస్ యాజమాన్య కంపెనీ మోనికా బ్రాడ్కాస్టింగ్ ప్రైవెట్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి వైదొలగాము. నాతోపాటుగా బోర్డులోకి వచ్చిన శ్రీ భాస్కరమూర్తి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన కోవిడ్ మహమ్మరికి బలయ్యారనే విషయం మీకు తెలిసిందే.మేము ముగ్గురమూ మోనికాలో మెజారిటీ వాటా తీసుకుని మహాన్యూస్ ను మీ అందరి సహాయ సహకారాలతో ఒక ఉత్తమ తెలుగు ఛానెల్ గా తీర్చిదిద్దాలనే తలంపుతో నడుంకట్టి ఉపక్రమించాం. మా ముగ్గురి దగ్గర ఉన్న ధనరాశి అందుకు పూర్తిగా సరిపోదనే సంగతి మాకు తెలుసు. అయితే మా ముగ్గురికి ఉన్న పరిచయాలతో కొంతమంది వెంచర్ ఫండ్ ఇన్వెస్టర్లతో మాట్లాడి వారు మా ఈ ప్రయత్నానికి సహకరించేలా ఒప్పించగలిగాము. వారు సరిపడ్డంత వనరులను ఈక్విటీగా మాకు సమకూర్చి, యాజమాన్యంలో ఏ మాత్రం జోక్యం చేసుకోకుండా పూర్తి స్వేఛ్ఛతో మేము ఛానెల్ నడిపేందుకు అంగీకరించి ముందుకు వచ్చారు. తెలుగులో విజయవంతమైతే తతిమ్మా దక్షిణభారత భాషలలోకి కూడా అనతికాలంలొనే విస్తరించడానికి కూడా ఉత్సాహం చూపించారు. ఆ ఒప్పందం దరిమిలా మేము బోర్డులో ప్రవేశించి, కొంత పెట్టుబడి కంపెనీలోకి తెచ్చి యాజమాన్య బాధ్యతలు పూర్తి స్థాయిలో తీసుకున్నాము. కొన్ని మార్పులు చేర్పులు చేసాము. కార్యాలయం పరిశుభ్రత లగాయితు ప్రోగ్రామింగ్, స్క్రీన్ లుక్, రిపోర్టింగ్ పంథా, చర్చల ఒరవడి, న్యూస్ ప్రెజంటేషన్, మొదలైన వాటిల్లో మంచి మార్పులు తెచ్చాము. ఒక ఇంట్లో ఉన్న అన్ని వయస్సులవారికీ, అభిరుచులు కలవారికీ మహాన్యూస్ లో ఏదో ఒక కార్యక్రమం తప్పకుండా ఉండేలాగా చానెల్ రూపురేఖల్ని తీర్చాము. తెలుగు భాష, సంస్కృతులకు వార్తాచానెల్ లో చోటు కల్పించాము. చిన్నపిల్లల్ని కూడా విస్మరించలేదు. కేంద్ర కార్యాలయంలో పనిచేసేవారికి యథాశక్తి మెరుగైన సౌకర్యాలు కలుగజేసాము. క్షేత్రస్థాయిలో రిపోర్టింగ్ చేసేవారికి కలిగినంతలో పారితోషికం ఇవ్వడం ప్రారంభించాము. రిపోర్టర్ల మీద మార్కెటింగ్ భారాన్ని పూర్తిగా తొలగించి వారు అడ్వర్టైజ్ మెంట్ల నిమిత్తంగా వార్తల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేకుండా, పక్క చూపులు చూసే పని లేకుండా చేసాం. మహా న్యూస్ కేవలం ఆంధ్రప్రదేశ్ కే ప్రాధాన్యత ఇచ్చే చానెల్ కాదు, ఇది తెలుగు చానెల్, రెండు తెలుగు రాష్ట్రాలకూ సమాన ప్రాధాన్యత ఇచ్చే చానెల్ అన్నది బలంగా రూఢి చెయ్యగలిగాం. వార్తను వార్త గా తీసుకోవాలి, ఏ రాజకీయ పార్టీకి గాని, వ్యక్తులకు గాని మనం బాకా ఊదకూడదు, ఎవరినీ వ్యతిరేకిస్తూ పనిగట్టుకుని వెంటాడకూడదు అనేది నియమంగా పెట్టుకున్నాం. నిస్పాక్షికతను ఒక నిష్ఠగా పెట్టుకున్నాం. సమాజంలోని అన్ని అభిప్రాయాలనూ, గొంతుకలనూ ప్రజలకు వినిపించడం ఒక వ్రతంగా స్వీకరించి పనిచేసాం. మహాన్యూస్ నిస్పక్షపాతంగా వార్తలను కథనాలను అందిస్తుంది అన్న గౌరవాన్ని సంపాదించుకున్నాం. వీక్షకుల విశ్వాసాన్ని చూరగొన్నాం, వారి మన్ననలను పొందగలిగాం. చానెల్ కనెక్టివిటీని బాగా మెరుగుపరచాం. వార్తలు, ప్రోగ్రాముల్లో నాణ్యత పెంచి, కనెక్టివిటీని మరింత విస్తరింపచేసిన తర్వాత తగినంత ప్రజాదరణ పొంది, రేటింగును బాగా మెరుగు పరుచుకుని తత్ఫలితంగా ఆదాయం పెరగడం మొదలవ్వగానే నామమాత్రంగా పారితోషికం తీసుకుంటూ క్షేత్రస్థాయిలో కష్టపడి నిబద్ధతతో పనిచేస్తున్న రిపోర్టర్లకు, స్ట్రింగర్లకు జీతాలు, పారితోషికాలూ పెంచుదామని సంకల్పించాం. మేమనుకున్నవి ఒకొక్కటీ ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెడుతుండగా హఠాత్తుగా కరోనా మహమ్మారి మీదపడింది. అప్పుడప్పుడే కొంచెం కొంచెంగా పుంజుకుంటున్న చానెల్ ఆదాయం ఈ విపత్తు వల్ల అడుగంటడం మొదలుపెట్టింది. ఇచ్చిన రిలీజ్ ఆర్డర్లను కూడా కొంతమంది ప్రకటనకర్తలు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకోని వారు రేట్లు తగ్గించమనో, అరువు రాసుకోండనో చెప్పడం ప్రారంభించారు. ఈ క్లిష్టపరిస్థితి మన ఒక్క సంస్థకే కాదు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో, యావత్ దేశంలో, మొత్తం ప్రపంచంలో ఉన్న మీడియా సంస్థలన్నింటికీ ఎదురయ్యింది. దశాబ్దాలుగా లాభాలనార్జించిన మీడియా సంస్థలు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యి జీతాలు తగ్గించడం, ఉద్యోగుల సంఖ్య కుదించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితికి వచ్చేసాయి. క్రమంతప్పకుండా ఒకటవ తారీకున ఉద్యోగుల ఎకౌంట్లలో జీతాలు వేస్తారనే ప్రతిష్ఠను సంపాదించుకున్నప్రముఖ సంస్థలు కూడా తల్లడిల్లిపోవడం, క్రమం తప్పడం మనం కళ్ళారా చూసాం. యాజమాన్యం చేపట్టి మూడు నెలలు తిరక్కుండానే మాకు ఎదురైన పరిస్థితి ఇది. ఇది ఇలా ఉంటే, మాకు ధనరాశి సమకూరుస్తానన్న వెంచర్ క్యాపిటల్ ఫండ్ కూడా ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంది. లాక్ డౌన్ ఇన్నాళ్ళు కొనసాగుతుందని మనమూ ఊహించలేదు, వారూ అంచనా వెయ్యలేకపోయారు. కోవిడ్ పరిణామాలు ఆర్థిక వ్యవస్థ మీద ఇంత కాలం ఇంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎవరూ పసిగట్టలేకపోయారు. రెండు మూడు నెలలు నోరు కట్టుకుని కాలం వెళ్ళబుచ్చితే పరిస్థితులు చక్కబడతాయని అందరం ఆశించాము. వారు కూడా రెండు మూడు నెలల్లో ధనరాశిని అందుబాటులోకి తేగలమనే విశ్వాసాన్ని మాకు ఇచ్చారు. కానీ పరిస్థితులను గమనిస్తే కోవిడ్ కష్టాలు ఇప్పుడప్పుడే తెమిలేలా కనపడ్డం లేదు. ఎప్పుడు మళ్ళీ వారు మాకు ఆర్థిక వనరులను సమకూర్చగలరో తెలియని అనిశ్చిత పరిస్థితి. మారిన పరిస్థితుల కారణంగా వారి ఫండింగ్ ప్రాధమ్యాలలో మీడియా రంగం ఎక్కడో అట్టడుగుకు వెళ్ళిపోయింది. మహా కుటుంబ సభ్యులైన మీకు సమయానికి జీతాలు ఇవ్వలేని, కనీసం ఎప్పుడు ఇవ్వగలమో చెప్పలేని దుస్థితి మాది. మీ కష్టాలు మాకు తెలియనివి కావు. నెలయ్యేటప్పటికి ఇంటి అద్దె దగ్గర్నుంచి నెలవారీ సరుకుల కొనుగోలు, ఈఎంఐ లు, ఇంట్లో పెద్దలకు మందులు వంటి ఖర్చులు, పిల్లల అవసరాలు, ఇవేవీ వాయిదా వేసుకోలేరు కదా. అయినా పళ్ళుబిగపట్టుకుని ఇన్నాళ్ళూ బండి లాక్కొచ్చారు. మీలో కొంతమంది సహనం కోల్పోయి నన్నుఅనామక సోషల్ మీడియా ఖాతాలనుంచి అమ్మ ఆలి అంటూ పచ్చి బూతులు తిడుతూ పోస్టులు కూడా పెట్టారు. నేనేమీ అనుకోలేదు. కష్టాలు అనుభవించే వారి కడుపు మంట నేను అర్ధం చేసుకోగలను కాబట్టి. అనేక సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలలో, ప్రజాక్షేత్రంలో పనిచేసిన వాడిగా దూషణ భూషణ తిరస్కారాలు నాకు అలవాటే. గనుక నేను మీ పరుష పదాలను తప్పుగా అర్ధం చేసుకోలేదు. కానీ మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నానే అనే స్పృహ మాత్రం నాకు బాగా క్లేశాన్ని కలిగించింది.అందువల్ల మహాన్యూస్ ను ఈ ఆర్థిక కష్టాలనుంచి గట్టెక్కించగల మరొక ఇన్వెస్టర్ ఎవరైనా దొరుకుతారేమోనని గాలింపు ప్రారంభించాను. వెతగ్గా వెతగ్గా ముంబయికి చెందిన శ్రీయుతులు మోహిత్ సింఘాల్, అశోక్ శ్రీవాస్తవ్ ల బృందం ఆసక్తి కనబరిచారు. వారికి ఉత్తరోత్తరా మరాఠీ లో కూడా ఒక చానెల్ నడపాలనే ఆలోచన కూడా ఉందని, ఇక్కడ కొంత అనుభవాన్ని గడించి అక్కడ దానిని ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు. మిగతావి ఎలా ఉన్నా వారు ముందు మీ ఆర్థిక ఇబ్బందులు తీర్చగలరు. ముందు కడుపంటూ నిండితే, కనీస అవసరాలు తీరితే, మిగతా విషయాలు ఒకొక్కటిగా అవే సర్దుకుంటాయి. అలా అనుకుని, మేము కొంత వాటా కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లకు ఇవ్వడానికి నిశ్చయించాము. రోజు వారీ నిర్వహణ బాధ్యతలు, ఎడిటోరియల్ పాలసీ నిర్దేశన కూడా వారు కోరుకున్నారు. నిజానికి వారు చానెల్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకునేంత పెద్ద ధనరాశినేమీ తీసుకురావడం లేదు. కాని, మనం నిస్సహాయ స్థితిలో వాటా ఇవ్వజూపినప్పుడు వారు పెట్టే షరతులకు ఒప్పుకోవలసిందే కదా. ఎక్కువ కాలం బేరసారాలు ఆడడం వల్ల మీకు నెలజీతాలు ఇంకా ఆలస్యం అవుతాయి అనే బెంగ కూడా మనసులో ఉండి సరేనని ఒప్పుకున్నాము. ఒప్పుకోక తప్పలేదు. ఇప్పటివరకూ మీకు రావాల్సిన జీతాల తాలూకు బాకీలు, ఇతర చెల్లింపులకు కూడా వారు పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఈ విషయం ఈ ఒప్పందం పట్ల నన్ను మరింత సానుకూలుణ్ణి చేసింది. మీ పాత బాకీల చెల్లింపుల విషయంలో మిమ్మల్ని ఎటువంటి ఆందోళనకూ, అసౌకర్యానికీ లోను చెయ్యమని నమ్మకంగా వారు నాకు చెప్పారు.వారు మమ్మల్ని బోర్డులో కొనసాగమనీ, స్థూలంగా చానెల్ కు మార్గనిర్దేశనం చెయ్యమనీ కోరారు. కానీ, మాకు అది ఆమోదయోగ్యంగా అనిపించలేదు. వారి అభిప్రాయాలేమిటో మాకు పూర్తిగా తెలియదు. వారు వివిధ రాజకీయ సామాజిక ఆర్థిక విషయాల మీద ఏ రకమైన వైఖరి అవలంబిస్తారో మాకు ఎరుక లేదు. వారి విలువలేమిటో, ప్రమాణాలేమిటో మాకు అవగాహన లేదు. వారిని ఒకటి రెండు సార్లు కలిసి మాట్లాడిన దరిమిలా ఇప్పటికి నాకున్న అంచనా ప్రకారం వారు నిస్పక్షపాతంగా ఉన్నత ప్రమాణాలతో చానెల్ నడుపుతారనే అనుకుంటున్నాను. కానీ, ఇలాంటి విషయాలలో ఎటుపోయి ఎటు వస్తుందో ముందే ఊహించడం కష్టం. కేవలం బోర్డు సభ్యత్వానికి పరిమితమయ్యి ఒక టీవీ చానెల్ కు మూణ్ణెల్లకొకసారి స్థూలంగా విధాన నిర్ణయం తీసుకుని మార్గ నిర్దేశనం చేస్తే సరిపోదన్నది నా నిశ్చిత అభిప్రాయం. ఎప్పటికప్పుడు క్షణాల మీద జరుగుతున్న పరిణామాల పట్ల మన వైఖరిని నిర్ణయించుకుని దాన్ని తెరమీద ప్రతిఫలించేటట్టు చెయ్యాలి. వార్తను ఎంచుకోవడం దగ్గర్నుంచి, దాన్ని రాసిన విధానం, చెప్పిన స్వరం మన వైఖరిని ఇట్టే తేటతెల్లం చేస్తాయి. అందుకని చానెల్ రోజువారీ నడక, స్థూలంగా దాని మార్గదర్శనం ఈ రెండూ కూడా కొత్త ఇన్వెస్టర్ల చేతుల్లోనే ఉండి ఒక్క చేతిమీదగా నడిస్తేనే సబబని అనిపించింది. వారికీ మనశ్శాంతి ఉంటుంది, మాకూ మానసిక ఒత్తిడి ఉండదు. అదీ కాక, ‘అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు’ అన్న సూత్రాన్ని మా అమ్మ నాకు చిన్నప్పటినుంచీ నూరిపోసింది. ఆ విధంగా చూసినా మేము కంపెనీ బోర్డు నుండి, చానెల్ రోజువారీ నిర్వహణ బాధ్యతల నుండి నిష్క్రమించడమే ఉత్తమమైన మార్గంగా మాకు తోచింది.కోవిడ్ మహమ్మారి కనుక అడ్డంపడకపోయి ఉంటే ఈ ఐదారు నెలల్లో మేము అనుకున్నవన్నీ చేసి మీ అందరి సహాయ సహకారాలతో మన చానెల్ ను మొదటి నాలుగైదు స్థానాల్లో ఖచ్చితంగా నిలబెట్టి ఉండగలిగే వాళ్ళం. మన కార్యక్రమాల నాణ్యత, వైవిధ్యం గురించి వివిధ వర్గాలనుంచి వస్తున్న ప్రశంసలు, యూట్యూబ్ లో మన వీడియోలకు పెరుగుతున్న ఆదరణలే దీనికి నిదర్శనం. కాని దురదృష్టవశాత్తు కాలం కలిసిరాలేదు. మీ అందరితో ఇన్ని నెలలు కలిసి పనిచెయ్యడం మాకు కలిగిన భాగ్యంగా మేము భావిస్తున్నాము. మీరందరూ మా పట్ల చూపించిన గౌరవ మర్యాదలు, అభిమానం, ఆప్యాయత, ఆపేక్షలు మేము ఎన్నటికీ మరువలేము. గత మూడు నాలుగు నెలలుగా మీరు మా వల్ల ఆర్థిక కష్టాలకు లోనైనా, మా పట్ల మీకున్న ఆదరణవల్ల సహనం వహించారు. మీకు మా కృతజ్ఞతలు. అలా సహించడానికి మీకు సహకరించిన మీ జీవిత భాగస్వాములకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, అవసరానికి మీకు అప్పులు ఇచ్చి ఆదుకుని మీరు ధైర్యం కోల్పోకుండా చూసిన మీ మిత్రులకు కూడా మా ధన్యవాదాలు.కొత్త బృందం మహా న్యూస్ ను బాగా వృద్ధిలోకి తెస్తుందని నా నమ్మకం. మీరందరూ కొత్తవారికి త్రికరణ శుద్ధిగా సహకరించి, మన చానెల్ ను అగ్రగామిగా నిలబెట్టడానికి వారు చేసే ప్రతి ప్రయత్నంలోనూ వెన్నుదన్నుగా ఉంటారని ఆశిస్తున్నాను.శెలవు, ఇట్లు భవదీయుడు డా. పరకాల ప్రభాకర్